Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lady Sarpunch Suicide: భర్త చేసిన పనికి తట్టులేక ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్.. ఇంతకి భర్త ఏం చేశాడంటే!

ఓ భర్త చేయకూడని పని చేసినందుకు భార్య తట్టుకోలేకపోయింది. గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్న తన భర్త అలాంటి పని చేయటంతో భరించలేని మహిళ సర్పంచ్ తనువు చాలించింది. ఈ ఘటన

Lady Sarpunch Suicide: భర్త చేసిన పనికి తట్టులేక ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్.. ఇంతకి భర్త ఏం చేశాడంటే!
Ghaziabad man kills five members of his family in 20 years for property
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 26, 2021 | 10:12 PM

ఓ భర్త చేయకూడని పని చేసినందుకు భార్య తట్టుకోలేకపోయింది. గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్న తన భర్త అలాంటి పని చేయటంతో భరించలేని మహిళ సర్పంచ్ తనువు చాలించింది. ఈ ఘటన మహబూబ్‎నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. మహిళ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా కలకలం రేపింది. మహబూబ్‎నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ తండాకు చెందిన శ్రీనివాస్‌ నాయక్‌ అనే వ్యక్తి, మాచారం తండాకు చెందిన పాల్‌ త్యావత్‌ సిరికి 12 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

రెండేళ్ల క్రితం నసురుల్లాబాద్‌ తండా కొత్త గ్రామ పంచాయతీగా మారింది. అక్కడి నుంచి 2019 జనవరి ఎన్నికల్లో పాల్ త్యావత్ సిరి ఏకగ్రీవంగా సర్పంచ్‎గా ఎన్నికయ్యారు. కొద్ది నెలల కిందట ఆమె భర్త శ్రీనివాస్‌ నాయక్‌ అదే తండాకు చెందిన ఓ వివాహితను తీసుకెళ్లిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈనెల 14న ఆ మహిళతో కలిసి నసురుల్లాబాద్ తండాకు వచ్చాడు. త్యావత్ సిరి శ్రీనివాస్‎తో గొడవ పడింది. అదే కోపంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో వైద్యులు హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి త్యావత్ సిరి హైదరాబాద్‎లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె సోదరుడు శంకర్‌ నాయక్‌ ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్‎పై పోలీసులు కేసు పెట్టారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Divorce Party Video: విడాకుల సందర్భంగా గ్రాండ్‌ పార్టీ.. విముక్తి లభించిందంటున్న మహిళ..(వీడియో)

 Warangal Medical College: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌..! రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు..(వీడియో)

 Lion and Tortoise video: నీళ్లు తాగడానికి వచ్చిన సింహం.. చుక్కలు చూపించిన తాబేలు..!(వీడియో)

 YSRCP Leaders Vs Pawan Kalyan: పవర్ స్టార్‌పై పంచుల యుద్ధం.. ఈ వివాదం ఏపీ ప్రభుత్వం vs తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతుందా..?(వీడియో)