Vaccination Process: వ్యాక్సిన్లను భుజానికే ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? దానికి కారణం ఇదే..
Vaccination Process: వ్యాక్సిన్... ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుంచి రకరకాల వ్యాక్సిన్లను తీసుకుంటూనే ఉంటాం. కొన్ని వ్యాక్సిన్‌లు నోటి ద్వారా అందించేవి...
Vaccination Process: వ్యాక్సిన్… ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుంచి రకరకాల వ్యాక్సిన్లను తీసుకుంటూనే ఉంటాం. కొన్ని వ్యాక్సిన్‌లు నోటి ద్వారా అందించేవి ఉంటే మరికొన్ని ఇంజెక్షన్ ద్వారా ఇస్తుంటారు. అయితే సాధారణంగా అందించే ఇంజెక్షన్లను నడుము కింది భాగంలో ఇస్తుంటారు. ఇది మనందరికీ తెలిసిందే… మరి వ్యాక్సిన్లను భుజానికి ఎందుకు ఇస్తారనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మరీ ముఖ్యంగా కరోనా సమయంలో వ్యాక్సిన్‌కు సంబంధించి వార్తలు ఎక్కువగా వస్తోన్న సమయంలో.. వ్యాక్సిన్‌ను భుజానికే ఎందుకు ఇవ్వాలనే ఆసక్తికర ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. భుజం పై భాగంలో డెల్టాయిడ్ అనే కండరం ఉంటుంది. ఈ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కణాలు ఉంటాయి. ఈ కండరం ఉన్న చోట వ్యాక్సిన్ ఇస్తే.. రోగనిరోధక వ్యవస్థ తొందరగా చైతన్యమవుతాయి, దీంతో యాంటీ బాడీలు వేగంగా ఉత్పత్తి అవుతాయి. తద్వారా ఒకవేళ కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినా.. సదరు యాంటీ బాడీలను వైరస్‌ను సమర్థవంతంగా తిప్పుకొడతాయన్నమాట. ఇక యాంటీ బాడీలు ఎలా ఉత్పత్తి అవుతాయంటే.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి వెళ్లిన యాంటిజెన్లను రోగ నిరోధక వ్యవస్థ కణాలు గుర్తించి.. వెంటనే వినాళ గ్రంథులకు సమాచారం అందచేస్తుంది. దీంతో యాంటీబాడీల తయారీ ప్రక్రియ మొదలవుతుంది. వినాళ గ్రంథులు భుజానికి దగ్గగా ఉండడం కూడా వ్యాక్సిన్ అక్కడ ఇవ్వడానికి మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు.