2 years for mass victory : జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి నేటికి సరిగ్గా రెండేళ్లు
Two years for ysrcp mass victory : 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి...
Two years for ysrcp mass victory : 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ బరిలో నిలిచిన ఆ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి కారణమైన రోజు మే 23వ తేదీని వైసీపీ పార్టీ ఆనందోత్సాహాలతో మననం చేసుకుంటోంది. మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైయస్ఆర్‌సీపీ 151 సీట్లను గెలుచుకోగలిగింది. అంతేకాదు, 50 శాతానికి పైగా ఓట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది. 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 22 చోట్ల జయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమతమైంది. మూడు లోకసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 51 అసెంబ్లీ స్థానాలు ఉన్నరాయలసీమలో 49 సీట్లను గెలుచుకోగలిగిందంటే వైయస్ఆర్‌సీపీ హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగా, రెండేళ్ల పాలనలో సీఎం వైయస్ జగన్ 95 శాతం హామీలు అమలు చేశారంటూ ఈ సందర్భంగా వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ సారథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అనేక మార్పులను తీసుకొచ్చారని.. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గుర్తింపు తెచ్చుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
చారిత్రాత్మక విజయం#2YearsForYSRCPMassVictory pic.twitter.com/7NDifDm0s3
— YSR Congress Party (@YSRCParty) May 23, 2021