Corona Cases In India: భారత్‌లో క్రమంగా తగ్గుతోన్న కరోనా కేసులు.. కానీ మరణాల సంఖ్య ఇంకా భయపెడుతూనే ఉంది..
Corona Cases In India: కరోనా సెకండ్ వేవ్ దేశాన్నిఅతలాకుతలం చేసేస్తోంది. మొదటి వేవ్ సమయంలో రోజువారీ కేసులు లక్ష నమోదవుతేనే ఎంతో ఆందోళన చెందారు. అలాంటిది సెకండ్ వేవ్ సమయంలో...
Corona Cases In India: కరోనా సెకండ్ వేవ్ దేశాన్నిఅతలాకుతలం చేసేస్తోంది. మొదటి వేవ్ సమయంలో రోజువారీ కేసులు లక్ష నమోదవుతేనే ఎంతో ఆందోళన చెందారు. అలాంటిది సెకండ్ వేవ్ సమయంలో ఈ సంఖ్య ఏకంగా మూడున్నర లక్షలు దాటడంతో తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవడంతో దేశంలో భయానక పరిస్థితులు కనిపించాయి. ఆక్సిజన్ లభించక, సమయానికి బెడ్స్ దొరక్క ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఇక దేశంలో పెరుగుతోన్న కేసులను కంట్రోల్ చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేశాయి. దీంతో కాస్త సత్ఫలితాలు వస్తున్నాయి. తాజాగా నమోదవుతున్న కేసుల వివరాలే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు ఓసారి చూద్దాం. తాజాగా దేశ వ్యాప్తంగా కొత్తగా 2,40,842 కేసులు నమోదయ్యాయి. ఇది కాస్త ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ మరణాలు మాత్రం ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 3,741 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,65,30,132 కరోనా సోకగా వారిలో 2,34,25,467 మంది కోలుకున్నారు. ఇక 2,99,266 మంది కరోనా కారణంగా మృత్యు వాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 28,05,399 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో మొత్తం 19,50,04,184 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
Also Read: Covaxin: మీరు కోవ్యాక్సిన్ వాక్సిన్ తీసుకున్నారా?.. అయితే మీకో బ్యాడ్ న్యూస్..