Anandayya Corona Medicine: ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ
నెల్లూరు జిల్లాలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అంతే కాదు ఆనందయ్య మందుతో కరోనా ఖతం అవుతుందనే...
నెల్లూరు జిల్లాలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అంతే కాదు ఆనందయ్య మందుతో కరోనా ఖతం అవుతుందనే ప్రచారంతో యావత్ దేశం ఏపీ వైపు చూస్తోంది. ఆనందయ్య మందు కోసం వేలాది మంది ఆస్పత్రి ఐసీయూలను వదిలి నెల్లూరుకు క్యూ కడుతున్నారు. వేలాదిగా వస్తున్న ప్రజలను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఆనందయ్య తయారు చేసిన మందు విషయంలో ఆయుర్వేదం వర్సెస్ అల్లోపతిగా మారింది సీన్. ఆ మందుకు అంత సీన్ లేదంటూ అల్లోపతి వైద్యులు కొట్టిపారేస్తున్నారు. చెట్ల ఆకు పసరుతో తయారు చేసే మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందుపై ఆయుష్ కమిషనర్ రాములు స్పందించారు.
ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించాం.. అది ఆయుర్వేద మ౦దుగా కాకుండా నాటు మందుగానే పరిగణిస్తామని రాములు అన్నారు. మందు తయారీలో ఆయుర్వేద మందు ప్రోటోకాల్స్ లేవన్నారు. అలాగని ఆనందయ్య తయారు చేసే మ౦దు హానికరం కాదని స్పష్టం చేశారు. ఆనందయ్య వాడే పదార్థాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేనని క్లారిటీ ఇచ్చారు. ఆనందయ్య మందుతో కరోనా బాధితులకు ఉపశమనం లభిస్తున్న మాట వాస్తవమే. అయితే ఇది కరోనా కోసం తయారు చేసిన మందు కాదన్నారు ఆయుష్ కమిషనర్.
ఆనందయ్య మందుపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. ఈ మందు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఆనందయ్య తయారీ చేశానని చెప్పారు. కరోనా కోసమే మందు తయారు చేశానని ఆనందయ్య కూడా ఎక్కడా చెప్పలేదు. హానికరం కాదు కాబట్టి ..ఆనందయ్య మందు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాకపోతే ఆయుర్వేద మందు అని పిలిస్తే…ఆయుష్ శాఖ నుండి అభ్యంతరం ఉందని రాములు తెలిపారు.
Also Read: మీరు కోవ్యాక్సిన్ వాక్సిన్ తీసుకున్నారా?.. అయితే మీకో బ్యాడ్ న్యూస్..