Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: తుఫాన్ ప్రభావంతో పలు మార్గాల్లో నిలిచిపోయిన రైళ్లు.. ముందస్తుగా 59 రైళ్లు రద్దు

Cyclone Yaas: దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేసేందుకు మరో తుఫాన్ ముంచుకొస్తోంది. శనివారం ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయిగుండంగా మారనున్న అల్పపీడనం..

Indian Railways: తుఫాన్ ప్రభావంతో పలు మార్గాల్లో నిలిచిపోయిన రైళ్లు.. ముందస్తుగా 59 రైళ్లు రద్దు
Indian Railways
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2021 | 8:23 AM

మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సంను మరవక ముందే మరో తుపాను రెడీ అవుతోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాలను అతలాకుతలం చేసేందుకు మరో తుఫాన్ ముంచుకొస్తోంది. శనివారం ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయిగుండంగా మారనున్న అల్పపీడనం.. ఆ తర్వాత తీవ్ర తుపానుగా బలపడుతుందని హెచ్చరించింది. ఈనెల 26కి అది పెను తుఫాన్ గా మారుతుందని అదే రోజు సాయంత్రం ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరుతుందని తెలిపింది. అల్పపీడనం మరో మూడు రోజుల్లో తీవ్రవుగుండం మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖహెచ్చరించింది.

తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని జోన్‌ మీదుగా రాకపోకలు సాగించే 59 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ శనివారం రాత్రి ప్రకటించింది. హౌరా-హైదరాబాద్‌ (08645), హైదరాబాద్‌-హౌరా (08646), హౌరా-సికింద్రాబాద్‌ (02703) రైళ్లు ఈనెల 25 నుంచి 27 వరకు నిలిచిపోనున్నాయి . సికింద్రాబాద్‌-హౌరా (02704) సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను 24 నుంచి 26 వరకు రద్దు చేశారు.

భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (07015) 26 నుంచి 28 వరకు, సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ (07016) 24 నుంచి 26 వరకు రద్దయ్యాయి. తిరుపతి – పూరి (07479) ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 24- 26 మధ్య, తిరుపతి-పూరి (నెం.07480) 26 నుంచి 28 వరకు నిలిచిపోనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. గౌహతి-సికింద్రాబాద్‌ (నెం.07029), సికింద్రాబాద్‌-షాలిమార్‌ (నెం.02774)25న, షాలిమార్‌-సికింద్రాబాద్‌ (నెం.02773)26న రద్దయ్యాయి.మిగిలిన వాటిలో ఎక్కువ రైళ్లు ఈనెల 26న ఒకరోజు, మరికొన్ని 27, 28, 29 తేదీల్లో రద్దయ్యాయి.

ఇక తుఫాన్ ప్రభావం తగ్గిన అనంతరం తిరిగి ఇందులోని కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణపై కూడా ఉండే అవకాశం ఉంది.

ఇవికూడా చదవండి: IMA on Baba Ramdev: మెడికల్ అసోసియేషన్ సీరియస్.. రాందేవ్ బాబాకు లీగల్ నోటీసులు..

Covid-19 vaccination: ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కోవిడ్ వ్యాక్సిన్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం..

Gas cylinder: బంపర్ ఆఫర్.. రూ.9 కే గ్యాస్ సిలిండర్.. ఎలా సొంతం చేసుకోవాలంటే..?

రైలు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటున్నారా? రద్దు ఛార్జీల నియమాలు
రైలు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటున్నారా? రద్దు ఛార్జీల నియమాలు
అప్పుడు కెమెరా అసిస్టెంట్.. ఇప్పుడు 2వేల కోట్లు వసూలు చేసిన హీరోయ
అప్పుడు కెమెరా అసిస్టెంట్.. ఇప్పుడు 2వేల కోట్లు వసూలు చేసిన హీరోయ
భారత్‌లో వరల్డ్ బెస్ట్ ఫుడ్ దొరికే ప్లేస్ ఇదే..
భారత్‌లో వరల్డ్ బెస్ట్ ఫుడ్ దొరికే ప్లేస్ ఇదే..
పట్టపగలే రూ.3.5 లక్షలు దోచుకెళ్లారు! సీసీ టీవీలో అంతా రికార్డ్‌
పట్టపగలే రూ.3.5 లక్షలు దోచుకెళ్లారు! సీసీ టీవీలో అంతా రికార్డ్‌
అడవిలో మేతకు వెళ్లిన ఆవును వెతుకుతూ వెళ్లిన యువకుడు..
అడవిలో మేతకు వెళ్లిన ఆవును వెతుకుతూ వెళ్లిన యువకుడు..
రోడ్డుపై SI యవ్వారాలు.. ఎందుకో అనుమానం వచ్చి చెక్‌ చేయగా..
రోడ్డుపై SI యవ్వారాలు.. ఎందుకో అనుమానం వచ్చి చెక్‌ చేయగా..
బీమా మార్కెట్లోకి పతంజలి.. ఆ ఇన్సూరెన్స్‌ కంపెనీ వాటా కొనుగోలు
బీమా మార్కెట్లోకి పతంజలి.. ఆ ఇన్సూరెన్స్‌ కంపెనీ వాటా కొనుగోలు
ఏడు రంగుల మట్టి, పగడపు దీవులను చూడాలా .. ఈ దేశాన్ని చుట్టేయండి
ఏడు రంగుల మట్టి, పగడపు దీవులను చూడాలా .. ఈ దేశాన్ని చుట్టేయండి
బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్.. 
ట్రెండ్ అవుతున్న తారక్ కొత్త సినిమా టైటిల్..