AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bommanahalli : భర్త చనిపోయిన కొంతసేపటికే భార్య ఆత్మహత్య.. గంటల వ్యవధిలోనే విగతజీవులుగా యువ జంట

Wife suicide shortly after husband's death : కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో దారుణం జరిగింది. భర్త చనిపోయాడని తనూ ఆత్మహత్యకు ఒడిగట్టింది ఓ నవవధువు...

Bommanahalli : భర్త చనిపోయిన కొంతసేపటికే భార్య ఆత్మహత్య.. గంటల వ్యవధిలోనే విగతజీవులుగా యువ జంట
Young Couple Died
Venkata Narayana
|

Updated on: May 23, 2021 | 8:38 AM

Share

Wife suicide shortly after husband’s death : కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో దారుణం జరిగింది. భర్త చనిపోయాడని తనూ ఆత్మహత్యకు ఒడిగట్టింది ఓ నవవధువు. జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని ఏడడుగులు నడిచిన భర్త అంతలోనే దూరం కావడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. దీంతో భర్త అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చిన భార్య గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొమ్మనహళ్లిలో ఉండే కిరణ్‌ (30), పూజా (22)లకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. వీళ్లిద్దరూ బొమ్మనహళ్లిలోనే కాపురం ఉంటున్నారు. అయితే, గుండెజబ్బుతో బాధపడుతోన్న కిరణ్.. బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. దీంతో బంధువులు కిరణ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అయితే, ఈ క్రమంలో ఇంటికి వచ్చిన పూజా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త అంత్యక్రియలు ముగిసిన కొంతసేపటికే భార్య పూజా మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిపించాల్సి వచ్చింది. గంటల వ్యవధిలోనే మరో దారుణం చోటుచేసుకోవడంతో ఇరువురి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Read also : Sony Wood Nuthulapaty : ‘సీఎం జగన్ నియమించిన APPSC సభ్యులు నూతులపాటి సోనీ వుడ్ ఏంమాట్లాడారో చూడండి’ : బీజేపీ