Suicide In AndhraPradesh: రెండు నిండు ప్రాణాలను బలిగొన్న మాయదారి ఆట.. ఇంటి పెద్ద పేకాటకు బానిస కావడంతో..
Suicide In AndhraPradesh: పేకాట... కాలక్షేపంగా మొదలై వ్యసనంగా మారే ఓ మాయదారి ఆట. ఒక్కసారి ఈ ఆటకు అలవాటైతే ఇక అంతే సంగతులు కుటుంబానికి సైతం మర్చిపోయి ఆడుతుంటారు...

Suicide In AndhraPradesh: పేకాట… కాలక్షేపంగా మొదలై వ్యసనంగా మారే ఓ మాయదారి ఆట. ఒక్కసారి ఈ ఆటకు అలవాటైతే ఇక అంతే సంగతులు కుటుంబానికి సైతం మర్చిపోయి ఆడుతుంటారు. రూ. లక్షల్లో డబ్బును కోల్పోతుంటారు. తెలియకుండానే పేకాట ఊబిలోకి వెళ్లిపోతుంటారు. ఇక పేకాట ఇప్పటి వకు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. ఈ గ్యాంబ్లింగ్ గేమ్ ఆడి సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా కుటుంబాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ధర్మవరంలో పేకాట ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీకి చెందిన గోపీ అనే వ్యక్తి పేకాటకు బానిసయ్యాడు. ఈ ఆటలో సర్వం కోల్పోయి.. చివరికి ఇంటిని సైతం అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. సొంతింటిన రూ. 10 లక్షలకు అమ్మేశాడు. దీంతో గోపీకి తన భార్య వీరమ్మకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వీరమ్మ.. తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి చెరువులోదూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తల్లీకుమార్తెల మృతదేహాలను చెరువులోంచి వెలికితీశారు. కేసు నమోదు చేసి గోపిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: Suicide: అమానుషం.. భార్య స్నానం చేస్తున్న వీడియో వైరల్.. తట్టుకోలేక భర్త బలవన్మరణం..