Attacked for Wearing Mask: మాస్క్ పెట్టుకోమన్నందుకు ఐకేపీ అధికారిపై దాడి.. ముక్కుకు తీవ్ర గాయంతో ఆసుపత్రిపాలు..!
ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో మాస్క్ పెట్టుకుని మాట్లాడమన్నందుకు అధికారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు.
Officer Attacked for Wearing Mask: మాస్కు పెట్టుకుని మాట్లాడమన్నందుకు అధికారి ముక్కు పగలగొట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. అసలే కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. నిత్యం జిల్లావ్యాప్తంగా వందల కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఓ వైపు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తోంది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో మాస్క్ పెట్టుకుని మాట్లాడమన్నందుకు అధికారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. దీంతో ముక్కు పగిలడంతో ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు సెంటర్‌లో వీడీసీ ఆధ్వర్యంలో బుక్ కీపర్‌గా పనిచేస్తున్నారు శ్యామ్ కుమార్. అయితే ప్యాడి క్లినింగ్ కోసం వచ్చిన గొర్ల చిన్న ఆశాలు అనే రైతు సీరియల్ నంబర్ తప్పావని శ్యామ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే, అదే సమయంలో ఐకేపీ సెంటర్‌ను తనిఖీ చేసేందుకు వచ్చిన క్లస్టర్ కోఆర్డినేటర్ అశోక్ ఇద్దరి సముదాయించేందుకు ప్రయత్నించారు.
ఇదే క్రమంలో చిన్న ఆశాలు మాస్కు పెట్టుకుని మాట్లాడాలని అశోక్ సూచించాడు. దీంతో క్షణికావేశానికి లోనై చిన్న ఆశాలు ఒక్కసారిగా అశోక్ ముఖంపై కొట్టగా ముక్కు పగిలి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడే ఉన్న మిగతా రైతుల సహాయంతో అశోక్‌ను మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేసినట్టు బాధితుడు అశోక్ తెలిపారు. కాగా, కేసు నమోదు చేసుకున్న మెట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.