ఎండాకాలం చల్లగా ఐస్ క్రీం తిన్నాడు.. ఆ తర్వాత మెల్లగా కాలం చేశాడు.. కరోనా వేళ డెజర్ట్స్ తింటే డేంజర్..?

ఒకవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న మరణాలు.. కోవిడ్ వైరస్ నుంచి బయటపడాలంటే వేడి పదార్థాలు తీసుకోవడం తప్పనిసరంటున్న వైద్యులు.

ఎండాకాలం చల్లగా ఐస్ క్రీం తిన్నాడు.. ఆ తర్వాత మెల్లగా కాలం చేశాడు.. కరోనా వేళ డెజర్ట్స్ తింటే డేంజర్..?
Man Dies After Overeating His Favourite Ice Cream In Hyderabad

Man Dies with Eat Ice Cream: అతిగా ఐస్ క్రీమ్ తినడంతో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఒకవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న మరణాలు.. కోవిడ్ వైరస్ నుంచి బయటపడాలంటే వేడి పదార్థాలు తీసుకోవడం తప్పనిసరంటున్న వైద్యులు. ఈ సూచన నిర్లక్ష్యమే హైదరాబాద్ లోని నాచారంకు చెందిన సాయి సంపత్ ప్రాణాలు కోల్పోయాడు.

స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ప్యాక్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ తెప్పించుకుని తిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. నాచారం వీఎస్‌టీ కాలనీకి చెందిన సాయి సంపత్ ఫుడ్ డెలివెరీ యాప్‌లో తనకు ఇష్టమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కేజీ ఆర్డర్ చేశాడు. అయితే, అందులో 90 శాతం ఐస్ క్రీమ్ తినగానే సాయి సంపత్‌కు వాంతులు, విరోచనాలయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి సంపత్. ఆ తర్వాత కొద్దిసేపటికే మృతి చెందాడు. అంబులెన్స్‌లో సాయిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్న దశలో మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, ఐస్‌క్రీమ్‌ తినడం వల్లే సాయి సంపత్‌ చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు. రూమ్‌లో ఒక్కడే ఉండేవాడని, ఎవరితో మాట్లాడేవాడు కాదని చెబుతున్నారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందా ? లేక మరేదైనా కారణం ఉందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఐస్‌క్రీంలో చక్కెర పాళ్లు ఎక్కువగా ఉంటుంది. ఆ మాట కొస్తే.. చాక్లెట్లు, క్యాండీలు, కుకీలు ఇతర డెసర్ట్ పదార్థాల్లో షుగర్ పాళ్లు ఎక్కువే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

ఐస్ క్రీమ్ ద్వారా కరోనా వైరస్ః చైనా పరిశోధకులు

ఈ ఏడాది జనవరిలో జరిపిన పరిశోధనలో.. టియాంజిన్ డాకియోడావో ఫుడ్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీమ్స్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మూడు నమూనాలను పరీక్షించి వైరస్ ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో డాకియోడావో కంపెనీకి చెందిన 4,836 ఐస్ క్రీమ్ బాక్స్‌లు పరీక్షించి 2,089 బాక్స్‌లకు సీజ్ చేశారు స్థానిక అధికారులు. కంపెనీలో పనిచేస్తున్న 1,662 మంది ఉద్యోగులను క్వారెంటైన్ చేసింది టియాంజిన్ కంపెనీ. ఐస్ క్రీం కంపెనీలో అపరిశుభ్రత, కరోనా వ్యాధిగ్రస్తుల మూలంగా కరోనా వ్యాపించిందని లీడ్స్ విశ్వ విద్యాలయం వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫెన్ గ్రిఫెన్ నిర్ధారించారు. అయితే, ఐస్ క్రీంల తయారీకి విదేశాల నుంచి ముడి సరుకును తెప్పించుకుంటున్నట్లు తేలింది. న్యూజిలాండ్ నుంచి పాలపొడి ఉక్రెయిన్ నుంచి పాలకుసంబంధించిన ఇతర ముడిపదార్థాలను దిగుమతి చేసుకుంటున్నాయి చైనా కంపెనీలు.

స్వీట్ ఫుడ్స్ ఆరోగ్యంపై ప్రభావం….

ఐస్ క్రీం, కుకీలు, క్యాండీ తదితర చక్కెర పాళ్లు అధికంగా ఉన్న డెసర్ట్ లు తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందంటున్న పరిశోధకులు. అయితే, ఈ స్థాయి ప్రమాదకర స్థాయిలో ఉండదని వెల్లడించారు. ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా.. రక్తంలో సుగర్ స్థాయి పెరుగుతుందన్న విషయం తెలిసిందే. షుగర్ అంటే… ఒక రకానికి చెందిన మాలిక్యూల్స్ కూడిన కార్బో హైడ్రేట్స్.. ఈ కార్బో హైడ్రేట్స్ పరిమితి ఆయా ప్యాక్ డ్ ఆహార ఉత్పత్తులపై ముద్రించి ఉంటుంది. మనం తినేటప్పుడు మన ఆరోగ్య స్థాయిని అనుసరించి వీటిని తీసుకోవల్సి ఉంటుంది.

మెదడుపై.. ప్రభావం..

సాధారణంగా చాకోలేట్లు, ఐస్ క్రీం.. కుకీలు. నిర్ణీత పరిమితి మేరకు తింటే మెదడు ఉత్తేజితం అవుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. పరిమితిని మించి తీసుకున్న ఒక్క సుగర్ కణం కూడా శరీరంపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో అదనంగా కలుపుకునే చక్కెర 25 గ్రాములను మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అధిక సుగర్ ఉన్న పదార్థాలు తీసకుంటే మెదడులోని మెమరీ, శిక్షణ కలాపాలను నియంత్రించే భాగం(హిప్పోక్యాంపస్) పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది డిమెంతియా అనే వ్యాధికి కూడా దారి తీస్తుందంటున్నారు.

Read Also….  మీకు తెలుసా..! ఆలు సమోసాకు ఓ పెద్ద చరిత్ర ఉందని..! ఈ అమోఘమైన వంట మనది కాదని..! మరి ఎవరిదో..!

Click on your DTH Provider to Add TV9 Telugu