Umadevi suicide: వ్యవసాయ శాఖ ఉద్యోగి ఉమాదేవి ఆత్మహత్య ఘటన : నగరంపాలెం సిఐ మల్లికార్జున రావు, కానిస్టేబుల్ మణిపై కేసు

Umadevi suicide case : గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగి ఉమాదేవి ఆత్మహత్య ఘటన కీలక మలుపులు తిరుగుతోంది...

Umadevi suicide: వ్యవసాయ శాఖ ఉద్యోగి ఉమాదేవి ఆత్మహత్య ఘటన : నగరంపాలెం సిఐ మల్లికార్జున రావు, కానిస్టేబుల్ మణిపై కేసు
Umadevi Suicide Case
Follow us

|

Updated on: May 23, 2021 | 9:39 PM

Umadevi suicide case : గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగి ఉమాదేవి ఆత్మహత్య ఘటన కీలక మలుపులు తిరుగుతోంది. ఉమాదేవి సూసైడ్ కు సంబంధించి నగరంపాలెం సిఐ మల్లికార్జున రావు, కానిస్టేబుల్ మణి లపై కేసు నమోదైంది. సిఐ, కానిస్టేబుల్ వేధింపుల వల్లే ఉమాదేవి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు సిఐ, కానిస్టేబుల్ పై కేసు రిజిస్టర్ చేశారు. సదరు పోలీసులు ఉమాదేవిని స్టేషన్ కు పిలిచి వేధించారని , బలవంతంగా ఆస్తి రాయించేందుకు బెదిరించారని మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, పోలీసులు ఉమాదేవి కారు తీసుకొని స్వంతంగా వాడుకున్నారని.. పోలీసులు చిత్రహింసలు తట్టుకోలేకే ఉమాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఇలా ఉండగా, గుంటూరు నగరంలోని అంకమ్మనగర్‌లోని భూసార పరీక్ష కేంద్ర కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగినిగా పనిచేస్తోన్న చికినం ఉమాదేవి(59) శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, ఉమాదేవి కుమారుడు బాజీకిరణ్‌కు రెండేళ్ల క్రితం నల్లచెరువుకు చెందిన అంజనీకుమారితో వివాహం జరిగింది.

అయితే, ఇటీవల కరోనా సోకి బాజీకిరణ్ చనిపోయాడు. ఉమాదేవి కుటుంబం అంతా బాజీకిరణ్‌ మృతితో షాక్‌లో ఉంటే ఆయన భార్య అంజనీకుమారి, మామ శ్రీనివాసరావు తదితరులు ఆస్థి పంచాలని.. బాజీకిరణ్ కు సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చివేయాలని ఉమాదేవి ఇంటికి వచ్చి ఒత్తిడి చేసినట్టు సమాచారం. కర్మకాండలు పూర్తయిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పినా వినిపించుకోకుండా నగరంపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టు ఉమాదేవి మరో కుమారుడు చెబుతున్నారు.

Read also : Cyclone Yaas: : యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ, తయారీపై యుద్ధప్రాతిపదికన ఏపీ సర్కారు చర్యలు