Cyclone Yaas: : యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ, తయారీపై యుద్ధప్రాతిపదికన ఏపీ సర్కారు చర్యలు

Cyclone Yass Alerts : యాస్ తుఫాన్ తీవ్రమవుతోన్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

Cyclone Yaas:  : యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ సరఫరా, నిల్వ, తయారీపై యుద్ధప్రాతిపదికన ఏపీ సర్కారు చర్యలు
Follow us

|

Updated on: May 23, 2021 | 9:08 PM

Cyclone Yass Alerts : యాస్ తుఫాన్ తీవ్రమవుతోన్న నేపధ్యంలో మెడికల్ ఆక్సిజన్‌ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్దమైంది. యాస్ తుఫాన్ ప్రభావం ఏపీ తో పాటు ఐదు రాష్ట్రాల పై వుంటుందని రాష్ట్ర ప్రభుత్వంను కేంద్రం అలెర్ట్ చేసిన చేసిన నేపథ్యంలో ఈ ముందస్తు చర్యలు తీసుకుంది. రూర్కెల, ఒడిషా నుండి 100 మిలియన్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను రేపటి (ఈనెల 24) లోగా సమీకరణ చేయాలని నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపట్టారు ఆక్సిజన్ వార్ రూం ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. అంగుల్, కరీం‌నగర్, రూర్కెల నుండి ‌కూడా రోడ్ మార్గం‌లో ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో వైపు విశాఖపట్నం పోర్టుకు 120 మెట్రిక్ టన్నుల LMO ట్యాంకర్ల్ ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పంపింది. 120 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను గుంటూరు, తిరుపతి లో బఫర్ స్టాక్ పద్దతిలో స్టోర్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం లోని RINL, EIL, లిక్వినాక్స్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఆక్సిజన్ ఉత్పతి కోసం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందజేసే విధంగా చర్యలు చేపట్టారు.

కొవిడ్ పేషెంట్ లకు ఆక్సిజన్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు‌ లేకుండా ముందస్తుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్లు సిద్దం చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read also : Three weddings & a funeral: ఉల్లాసంగా, ఉత్సాహంగా కదలాడే ఆ ఊరు మొత్తం ఇప్పుడు నిర్మానుషమైపోయింది. ఎక్కడ.. ఎందుకలా..?