Earthquake: భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డ సరిహద్దు రాష్ట్రం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన మణిపురి జనం…
Earthquake: మణిపూర్‌ను భూ ప్రకంపనలు వణికించాయి. ఆదివారం ఉదయం 6.56 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
మరో సారి భూమి కంపించింది. గత కొద్ది రోజులుగా భూ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మణిపూర్‌ను భూ ప్రకంపనలు వణికించాయి. ఆదివారం ఉదయం 6.56 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో ఉక్రుల్‌లో భూమి కంపించిందని పేర్కొంది. ఉక్రుల్‌కు 49 కిలోమీటర్ల దూరంలో, భూమికి 109 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది.అయితే ఈ తీవ్రత పెద్దగా లేక పోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగక పోయి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
ఇంత వరకు మణిపూర్ ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, అంతా అప్పుడప్పుడే నిద్రలేచిన జనంకు ఒక్కసారిగా పెద్ద శబ్ధాలు రావడంతో అక్కడి జనం భయాందోళనకు గురయ్యారు. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. శనివారం అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ భూమికి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని చెప్పింది.