Gas Cylinder: జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా..? అసలు కారణమేంటో తెలుసా..?
Gas Cylinder Home Delivery: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది...
Gas Cylinder Home Delivery: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే వైద్య సంబంధిత ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులతో పాటు మరికొందరిని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇదిలా ఉంటే పలు వర్గాలకు చెందిన వారు సైతం తమరిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్యాస్ పంపిణీదారులు కూడా తమను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ కోరింది. వ్యాక్సినేషన్ చేపట్టకుంటే ఈ నెల 29 నుంచి గ్యాస్ డెలివరీ నిలిపేస్తామని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, కె.జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. కోవిడ్ కారణంగా ఇప్పటికే అనేక మంది పంపిణీదారులు వైరస్ బారిన పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి ఇంటింటికీ వెళ్లి ఎల్పీజీ సిలిండర్లు అందజేయాల్సి ఉంటుందన్నారు. తాము రాష్ట్రంలో రోజుకు రెండు లక్షల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.