Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఓరుగల్లు వాస్తవ్యుడు.. ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నియామకం

KU New Vice Chancellor: కాకతీయ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా కేయూ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నియమితులయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో వర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్‌ కమిటీ ముగ్గురు పేర్లతో...

కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఓరుగల్లు వాస్తవ్యుడు.. ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నియామకం
Kakatiya University To Get
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2021 | 7:35 AM

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్‌ ఛాన్స్‌లర్లను (VC) ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను తెలంగాణ సర్కార్ నియమించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు UGC నిబంధనలకు అనుగుణంగా V.Cల నియమక యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సిఫారసు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన V.Cల జాబితాను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే.

ఇందులో కాకతీయ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా కేయూ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ నియమితులయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో వర్సిటీ వీసీ నియామకానికి సెర్చ్‌ కమిటీ ముగ్గురు పేర్లతో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పంపించిన ఫైల్‌పై శుక్రవారం రాత్రి గరవర్నర్‌ సంతకం చేశారు. రెగ్యులర్‌ వీసీగా ఉన్న ప్రొఫెసర్‌ సాయన్న పదవీకాలం 2019 జూలైలో ముగిసింది. ప్రొఫెసర్ సాయన్న  స్థానంలో ఇన్‌చార్జి వీసీగా డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించారు.  అయితే ఇటీవల ప్రభు త్వం ఆయనను TSPSC చైర్మన్‌గా నియమించింది.

ఈ నేపథ్యంలో తాజాగా తాటికొండ రమేశ్‌‌ను వీసీగా నియామకం చేసింది. ప్రొఫెసర్‌ రమేశ్‌ వరంగల్ వాస్తవ్యుడు. స్వస్థలం నగరంలోని గోవిందరాజులగుట్ట సమీపంలోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. 1962 డిసెంబర్‌10న జన్మిం చారు. ప్రాథమిక విద్యాభ్యాసం, హైస్కూల్‌, ఇంటర్‌, డిగ్రీ వరంగల్‌ నగరంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో 1987లో ఎంఏ సోషియాలజీ, 1990లో ఎంఫిల్‌, 2009 సంవత్సరంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1992లో కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకమయ్యారు.

కేయూ పరిధిలోని నిర్మల్‌ పీజీ సెంటర్‌లో సోషియాలజీ విభాగంలో చేరిన ప్రొఫెసర్ రమేశ్‌, కేయూ సోషియాలజీ విభాగాధిపతిగా, ఆర్ట్స్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీ చైర్మన్‌గా, సోషల్‌ సైన్స్‌ డీన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కేయూ అకడమిక్‌ ఆడిట్‌ డీన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ సామాజిక అంశాలపై 20కి పైగా పుస్తకాలు రాసిన ఆయన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ఉపన్యాసాలు ఇచ్చారు. రమేశ్‌ పర్యవేక్షణలో 8మంది పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే కేయూ ఇన్‌చార్జి వీసీ జనార్దన్‌రెడ్డి నుంచి వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇవి కూడా చదవండి: Gold Price Today: తటస్థంగానే బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు ఇలా..

Black Gram: మినుములు తింటే.. ఇనుమంత బలం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..