AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Gram: మినుములు తింటే.. ఇనుమంత బలం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Health Benefits of Black Gram: మనం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అనేక రకాల తృణ ధాన్యాలు పోషకాలు అందిస్తాయి. అలాంటి వాటిల్లో మినుములు ఒకటి. సాధారణంగా చాలామంది మినుములు

Black Gram: మినుములు తింటే.. ఇనుమంత బలం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకే..
Benefits Of Black Gram
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2021 | 5:07 AM

Share

Health Benefits of Black Gram: మనం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అనేక రకాల తృణ ధాన్యాలు పోషకాలు అందిస్తాయి. అలాంటి వాటిల్లో మినుములు ఒకటి. సాధారణంగా చాలామంది మినుములు తింటే ఇనుము అంత బలం చేకూరుతుంది.. అంటూ చెబుతుంటారు. ఆ నానుడి ప్రకారం.. మినుముల్లోని పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతోపాటు.. అనేక రోగాల నుంచి కాపాడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మినుములు జీర్ణక్రియకు మెరుగుపరిచి బలాన్ని చేకూరుస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వంద గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు (ఫైబర్) పదార్థం ఉంటుంది. ఒక గ్రాము పొటాషియం, రెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. దీంతోపాటు విటమిన్ సీ, విటమిన్ బీ- కాంప్లెక్స్‌లోని బీ1, బీ3 తోపాటు.. కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మినుముల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియ.. మినుములను నిత్యం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. మినుముల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.. కావున ఎవరైనా జీర్ణసమస్యలతో బాధపడుతుంటే.. మినుములను ఆహారంలో చేర్చితే ప్రయోజనం కలుగుతుంది. దీంతోపాటు మలబద్దకం, ఉబ్బసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

డయాబెటిస్‌.. రక్తహీనత మినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మినుముల వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి.. డయాబెటిస్ సమస్య తలెత్తకుండా మినుములు సహకరిస్తాయి. అంతేకాకుండా రక్తహీనత సమస్యను కూడా నివారిస్తాయి.

ఎముకలు.. మినుముల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఎముకలు బలంగా, ధృఢంగా మారడానికి దోహదపడతాయి. కావున ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారు మినుములను తినడం మంచింది.

మంటను తగ్గిస్తాయి.. మినుముల్లో మంటను తగ్గించే యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉంది. గాయాలు, నొప్పులతో బాధపడుతున్న వారికి మినుములతో తయారు చేసిన ఆహారం వడ్డిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వీటిలోని పోషకాల వల్ల చర్మ సౌందర్యం కూడా బాగా పెరుగుతుంది.

గుండెకు రక్షణ.. మినుముల్లో గుండె జబ్బులను నివారించే అద్బుతమైన గుణం ఉంది. ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణమని పరిశోధనల్లో తేలింది. అవి రక్తంలో వెలువడే చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ మంచిగా జరగడం వల్ల హృదయ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

Also Read:

Radish: ముల్లంగిని ఈ నాలుగు ఆహార పదార్థాలతో తింటే.. విషంతో సమానం.. ఎందుకంటే..?

Covid-19 Vaccine: అందుబాటులో మూడు కరోనా వ్యాక్సిన్లు.. వాటి సామర్థ్యం, దుష్ప్రభావాల గురించి తెలుసా..?

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?