Radish: ముల్లంగిని ఈ నాలుగు ఆహార పదార్థాలతో తింటే.. విషంతో సమానం.. ఎందుకంటే..?

Side Effects of Radish: ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. సలాడ్‌గా లేదా.. సాధారణంగా తిన్నా.. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి,

Radish: ముల్లంగిని ఈ నాలుగు ఆహార పదార్థాలతో తింటే.. విషంతో సమానం.. ఎందుకంటే..?
Benefits Of Radish
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 22, 2021 | 6:03 AM

Side Effects of Radish: ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. సలాడ్‌గా లేదా.. సాధారణంగా తిన్నా.. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఆంథోసైనిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. వీటివల్ల నోటి సమస్యలు.. ఉదరం, మూత్రపిండాలు, డయాబెటిస్ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు అన్ని దూరమవుతాయి. అయితే.. చాలామంది సలాడ్ మాదిరిగా ముల్లంగిని తింటుంటారు. అయితే.. ఆరోగ్యానికి మేలు చేసే ముల్లంగిని కొన్ని ఆహార పదార్థాలతో అస్సలు తినకూడదని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. అలా తినడం వల్ల ప్రతిచర్య జరిగి.. ఫుడ్ పాయిజన్ అవుతుంది. తీరా అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే ముల్లంగిని ఎలాంటి ఆహార పదార్థాలతో కలిపి తినకూడదో ఒకసారి పరిశీలిద్దాం..

నారింజ.. మీరు ముల్లంగి తిన్న అనంతరం వెంటనే నారింజను కొన్ని గంటలపాటు తినకూడదు. ఈ రెండింటి కలయిక విషంతో సమానం. ఇది కడుపుకు చాలా సమస్యలను కలిగిస్తుంది. దీంతోపాటు మీ జీర్ణక్రియకు కూడా విఘాతం కలుగుతుంది. ఒకవేళ తినాలనుకుంటే.. నారింజ తిన్న 10 గంటల తర్వాత ముల్లంగి తినాలని సూచిస్తున్నారు.

కీరదోస.. చాలామంది కీరదోస, ముల్లంగి రెండింటినీ సలాడ్‌లో ఉపయోగిస్తారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదరం సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. రెండింటిలో ఏదో ఒకదానిని తినాలని సూచిస్తున్నారు. కనీసం రెండింటి మధ్య 10గంటల గ్యాప్ ఉండాలి.

కాకరకాయ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే.. కాకరకాయ తిన్నప్పుడు ముల్లంగి తినకూడదు. ఈ రెండు కూడా ప్రతిచర్యను కలిగిఉంటాయి. అలా రెండు కలిపి తింటే.. శ్వాసకోశ సమస్యలు కలుగుతాయి. గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే.. కాకరకాయ తింటే.. కనీసం 24 గంటలపాటు ముల్లంగిని తినకూడదు.

పాలు ముల్లంగి తింటే.. వెంటనే పాలు, పాలతో తయారు చేసిన వస్తువులను తినకూడదు. వాస్తవానికి ముల్లంగి.. పాలు రెండూ వేర్వేరు స్వభావం కలిగి ఉంటాయి. అయితే.. రెండూ పదార్థాలను తింటే.. కడుపు సమస్యలు మరింత పెరుగుతాయి. చర్మ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఈ రెండింటి మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి ఉండాలని సూచిస్తున్నారు.

Also Read;

Cockroach Saliva : బొద్దింకల లాలాజలం చాలా డేంజర్..! ఇంటి నుంచి వాటిని ఎలా తరిమికొట్టాలో తెలుసుకోండి..

White Hair Problem: తెల్లజుట్టుతో బాధపడుతున్నారా.? ఈ నాలుగు ఫుడ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.!