White Hair Problem: తెల్లజుట్టుతో బాధపడుతున్నారా.? ఈ నాలుగు ఫుడ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.!
White Hair Problem: ఈ ఉరుకుల పరుగుల జీవితంగా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం. సమయానికి..
White Hair Problem: ఈ ఉరుకుల పరుగుల జీవితంగా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టం. సమయానికి ఆహారం, టైంకి నిద్ర లేకపోవడం.. మన శరీరంలో పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు తగ్గడంతో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిల్లో ఒకటి తెల్లజుట్టు సమస్య. ఈ రోజుల్లో యువత ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. అసలు తెల్లజుట్టు సమస్య ఎందుకు వస్తుంది.? కొన్ని నివేదికల ప్రకారం, జుట్టులో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది వృద్ధాప్యం సమయంలో తగ్గుతుంది. అందుకే జుట్టు తెల్లగా మారుతుంది. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే.. మీ డైట్‌లో విటమిన్ బి, విటమిన్ బి 6 మరియు విటమిన్ బి 12 అధికంగా ఉండే కలిగిన ఫుడ్స్ జోడిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- బచ్చలికూర – బచ్చలికూరలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అధిక మొత్తంలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఇది జుట్టును తెల్లగా మారకుండా నిరోధిస్తుంది. ఈ ఆకుకూరను మీ డైట్‌లో జోడిస్తే తెల్ల జుట్టు సమస్యతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుండి దూరం చేస్తుంది.
- కరివేపాకు – కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇందులో తగినంత మొత్తంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంది. ఇవి జుట్టును తెల్లగా మారకుండా చేస్తాయి.
- బ్లూబెర్రీ – బ్లూబెర్రీలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి దూరం చేస్తుంది. బ్లూబెర్రీస్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. ఇవే కాకుండా, ఇందులో విటమిన్ బి 12, అయోడిన్, జింక్ కూడా ఉన్నాయి. ఇది మీ జుట్టును తెల్లగా కాకుండా చేస్తుంది.
- బ్రోక్లీ – బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్రోకలీలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. దాని వల్ల మీ జుట్టు తెల్లగా మారదు.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!