Black Fungus, White Fungus : బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్.. వీటిలో ఏది డేంజర్? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?

Black Fungus, White Fungus : కరోనా వైరస్ తర్వాత కొత్తగా వినబడుతున్న మాట బ్లాక్ ఫంగస్ (ముకోర్మైకోసిస్). వివిధ రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే

Black Fungus, White Fungus : బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్.. వీటిలో ఏది డేంజర్? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?
Black Fungus, White Fungus
Follow us

|

Updated on: May 21, 2021 | 9:39 PM

Black Fungus, White Fungus : కరోనా వైరస్ తర్వాత కొత్తగా వినబడుతున్న మాట బ్లాక్ ఫంగస్ (ముకోర్మైకోసిస్). వివిధ రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే ఈ కేసులు పెరుగుతున్నాయి. తక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇదిలా ఉంటే మళ్లీ ఇప్పడు వైట్ ఫంగస్ అని వినబడుతుంది. దీంతో ప్రజలు చాలా అయోమయంలో ఉన్నారు. అయితే ప్రధానంగా రోగనిరోధక శక్తి లేని కోవిడ్ -19 రోగులను ప్రభావితం చేసే వ్యాధి వైట్ ఫంగస్ అని తేలింది. అయితే నిపుణులు “వైట్ ఫంగస్” వంటి వ్యాధి లేదని చెబుతున్నారు. దానిని కాన్డిడియాసిస్ అంటున్నారు. వైట్ ఫంగస్ మొదటి నివేదికలు బీహార్లోని పాట్నా నుంచి వచ్చాయి. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్) ఈ నివేదికలను తోసిపుచ్చింది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో వైట్ ఫంగస్ అని పిలవబడే ఓ కేసు కనుగొనబడింది.

వైట్ ఫంగస్ కేవలం ఒక అపోహ మాత్రమే అంటున్నారు. ఇది ప్రాథమికంగా కాన్డిడియాసిస్ అనే ఫంగస్ వల్ల కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్ మాత్రమే అని నిపుణులు వాదిస్తున్నారు. ఇది సర్వసాధారణమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడా పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ కంటే “వైట్ ఫంగస్” చాలా ప్రమాదకరమని నివేదికలకు ఎటువంటి ఆధారం లేదని కొట్టిపారేసారు. బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స చేస్తున్న బొంబాయి ఆసుపత్రిలోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ కపిల్ సాల్జియా మాట్లాడుతూ.. ముకోర్మైకోసిస్ మరింత ఇన్వాసివ్, సైనసెస్, కళ్ళు, మెదడుకు చాలా నష్టం కలిగిస్తుందని అన్నారు. విస్తృతమైన శస్త్రచికిత్స అవసరమని చెబుతున్నారు.

ముకోర్మైకోసిస్ మరింత ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది సాధారణంగా మానవ వ్యవస్థలో కనిపించదు. కానీ కాండిడియాసిస్ సులభంగా నిర్ధారణ అవుతుంది. అంతేకాకుండా సులభంగా చికిత్స చేయొచ్చు. ఇది ప్రాణాంతకం కాదు. మీరు చికిత్స లేదా లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అప్పుడు హానికరంగా మారుతుందని డాక్టర్ కపిల్ సాల్జియా చెప్పారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు , కోవిడ్ -19 చికిత్స సమయంలో చాలా కాలం పాటు స్టెరాయిడ్స్ వాడినవారు కాన్డిడియాసిస్‌కు గురవుతారని తెలిపారు.

సర్వసాధారణమైన కాన్డిడియాసిస్ ఇన్ఫెక్షన్ ఓరల్ థ్రష్ అని నిపుణులు తెలిపారు. “ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా సన్నని లైనింగ్, పెదవులు, ముక్కు, నోటి లోపల, జననేంద్రియ ప్రాంతం వంటి శ్లేష్మ జంక్షన్లు ఉన్న శరీర భాగాలను ప్రభావితం చేస్తుంది” అని డాక్టర్ గిలాడా తెలిపారు. తలనొప్పి, ముఖం ఒక వైపు నొప్పి, వాపు, దృష్టి కోల్పోవడం లేదా దృష్టి తగ్గడం, నోటిలో పుండు వంటివి గమనించాల్సిన లక్షణాలు. సంక్రమణను గుర్తించడానికి 10 శాతం KOH (పొటాషియం హైడ్రాక్సైడ్) లోపు సాధారణ మైక్రోస్కోపిక్ పరీక్ష చేయవచ్చని డాక్టర్ గిలాడా తెలిపారు.

Tv9

Tv9

Health Minister Harsh Vardhan: 2021 చివరి నాటికి ప్రతి ఒక్కరికి కరోనా టీకా..కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్.. స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన బన్నీ..

Garlic Water : పరగడుపున వెల్లుల్లి నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు..! ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చక్కటి మార్గం..