Health Minister Harsh Vardhan: 2021 చివరి నాటికి ప్రతి ఒక్కరికి కరోనా టీకా..కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
Health Minister Harsh Vardhan: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి మొత్తం.
Health Minister Harsh Vardhan: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాకు కరోనా టీకాలు వేసేందుకు ముందుకు సాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమమ శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వ్యాక్సిన్ తయారీదారులకు, టీకా మోతాదుల లభ్యతను పెంచడంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు మద్దతు ఇస్తోందన్నారు. భారత్ 267 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను కొనుగోలు చేస్తుందని, జూలై నాటికి 51 కోట్ల మోతాదులను సేకరించనున్నట్లు చెప్పారు. శుక్రవారం కోవిడ్-19పై తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో మంత్రి హర్షవర్ధన్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని, ఎనిమిది రోజులుగా రికవరీ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు. గత ఐదు రోజులుగా భారత్‌లో 3 లక్షల కన్న తక్కువ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఒకే రోజులో అత్యధికంగా 20,61,683 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 30శాతం పాజిటివిటీ రేటు ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం 35వేలకుపైగా క్రియాశీల కేసులున్నాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మరణాల రేటు1.44 శాతం ఉన్నట్లు చెప్పారు. కరోనాను పూర్తిగా కట్టడి చేయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర తీసుకుంటున్న చర్యల వల్లే కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయన్నారు. అలాగే దేశ వ్యాప్తింగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు 18.5 కోట్లకుపైగా వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. 18 ఏళ్లపైబడిన వారందరికి టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
Union Health Minister @drharshvardhan reviewed Public Health Response to #COVID19 and Progress of #Vaccination with 9 States/UTs today.https://t.co/cs5hYxzf6A pic.twitter.com/Wovk4y2cic
— Ministry of Health (@MoHFW_INDIA) May 21, 2021