Children Covid-19: పిల్లల్లో కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి..? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే..!
Children Covid-19 Symptoms: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతున్న కరోనా.. రకరకాలుగా రూపాంతరం చెందుతూ మరింతగా వ్యాప్తి..
Children Covid-19 Symptoms: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతున్న కరోనా.. రకరకాలుగా రూపాంతరం చెందుతూ మరింతగా వ్యాప్తి చెందుతోంది. అయితే పెద్దలకు వచ్చే లక్షణాలు పిల్లల్లో కూడా స్వల్పంగా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు. కొందరి పరిస్థితి తీవ్రతరం కావచ్చు. అయితే లక్షణాలు లేని వారు ఇంట్లో 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు కనిపించే వారి పట్ల అతి జాగ్రత్తగా ఉండాలని, వారిలో పలు లక్షణాలు మామూలుగా కనిపించే అవశం ఉందంటున్నారు.
చిన్నారులకు కోవిడ్ వస్తే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, గొంతు సమస్యలు, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, ముక్క నుంచి నీరు కారడం, విరేచనాలు, వాసన, రుచి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై కోవిడ్ పరీక్షలు చేయించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అజాగ్రత్త చేసినట్లయితే పరిస్థితి తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇక గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్‌కు 2 నుంచి 12ఏళ్ల చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో త్వరలోనే చిన్నారులకు కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కోవిడ్ -19 తో పిల్లలు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని, 11 ముఖ్య లక్షణాలతో బాధపడుతున్నారని పరిశోధనలు అధ్యయనం ద్వారా తేల్చారు. 18శాతం మంది పిల్లలకు జ్వరం, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, వాసన లేదా రుచి వంటి లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. అలాగే16.5 శాతం మంది పిల్లలకు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య తలెత్తడం, దగ్గు ఉందని నిపుణులు వెల్లడించారు. 13.9 శాతం మందిలో వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు. సుమారు 8.1 శాతం మంది దద్దుర్లుతో బాధపడుతుండగా, 4.8 శాతం మందికి తలనొప్పి వచ్చింది నిపుణులు గుర్తించారు.
పిల్లలలో 11 కోవిడ్ లక్షణాలు:
1. జ్వరం 2. కండరాల లేదా కీళ్ల నొప్పి 3. నీరసం, కడుపునొప్పి 4. వాసన లేదా రుచి కోల్పోవడం.. 5. శ్వాస ఆడకపోవడం.. 6. దగ్గు 7. వికారం 8. వాంతులు 9. అతిసారం 10. దద్దుర్లు 11. తలనొప్పి
ఇవీ చదవండి:
Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు.. ఉదయాన్నే ఉసిరి తింటే ఆ సమస్యలు పరార్..!
Steam Inhalation: కరోనా కోసం అతిగా ఆవిరి పడితే ప్రమాదమే.. ముక్కు దిబ్బడ కోసమే పట్టాలి..!