Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Steam Inhalation: కరోనా కోసం అతిగా ఆవిరి పడితే ప్రమాదమే.. ముక్కు దిబ్బడ కోసమే పట్టాలి..!

Steam Inhalation: కరోనా బారిన పడకుండా చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో ఎక్కువగా చాలా మంది పాటించేది ఆవిరి పట్టడం. కరోనా మొదలు నుంచి..

Steam Inhalation: కరోనా కోసం అతిగా ఆవిరి పడితే ప్రమాదమే.. ముక్కు దిబ్బడ కోసమే పట్టాలి..!
Steam Inhalation
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2021 | 6:12 AM

Steam Inhalation: కరోనా బారిన పడకుండా చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో ఎక్కువగా చాలా మంది పాటించేది ఆవిరి పట్టడం. కరోనా మొదలు నుంచి చాలా మంది ఆవిరి పట్టడం ప్రారంభించారు. దీని ద్వారా కరోనా నుంచి రక్షించుకోవచ్చని కొందరు సూచిస్తుండటంతో ఆవిరి పడుతున్నారు. అయితే అతిగా ఆవిరి పట్టడం వల్ల కూడా ప్రమాదమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనాపై ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురవుతున్నారని, ఎవరో చెప్పారని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో 90 శాతం మందికి స్వల్ప లక్షణాలతోనే వ్యాధి తగ్గిపోతుందని, ఇలాంటి వారు టెన్షన్‌కు గురై ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండే నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక మిగిలిన 10 శాతం మందిలో ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉన్నందున కోవిడ్‌ తీవ్ర స్థాయికి చేరుతుందని వివరిస్తున్నారు.

9 రోజులకే కరోనా వైరస్‌ అంతం..

మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉన్నట్లయితే శరీరంలో ప్రవేశించిన 9 రోజులకే కరోనా వైరస్‌ అంతం అయిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

ముక్కు దిబ్బడ ఉంటేనే..

ముక్కు దిబ్బడగా అధికంగా ఉన్న వారు రెండు రోజుల పాటు ఐదు నిమిషాలు ఆవిరి పట్టాలని సూచిస్తున్నారు. అది కూడా కేవలం నీటితోనే ఆవిరి పట్టాలని, కర్పూరం, ఇతర ఆవిరి ట్యాబ్లెట్లు వినియోగించవద్దని స్పష్టం చేస్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల కరోనా రాదని రోజూ పడితే కరోనా తగ్గిపోతుందని భావించడం సరైంది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. నిజానికి ఆవిరి వల్ల కరోనాపై ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు. పైగా ఆవిరి పట్టడం వల్ల ముక్కులోని సున్నితమైన మ్యూకస్‌ పొరతో పాటు దానిపై ఉండే సీలియా పాడైపోయి వైరస్‌ త్వరగా లోపలికి వెళ్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆవిరి నీటిలో కర్పూరం లాంటి పదార్థాలను కలపడం వల్ల ఆక్సిజన్‌ శాతం పెరుగుతుందన్నదానిలో ఎలాంటి నిజం లేదంటున్నారు. పసుపు, కర్పూరంతో ఆవిరి పట్టడం వల్ల కళ్లు మంట పుట్టడంతో పాటు ఉబ్బసం, ఊపిరి తిత్తుల్లో సమస్యలున్నవారికి ఇబ్బందులు మరింత పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

Corona Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?.. నిపుణులేమంటున్నారు..?

Wear Mask In House: ఇంట్లోనూ మాస్క్ పెట్టుకోవాలా.? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.!