Wear Mask In House: ఇంట్లోనూ మాస్క్ పెట్టుకోవాలా.? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.!

Wear Mask In House: అసలే కరోనాకాలం.. ఆపై సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తోందో...

Wear Mask In House: ఇంట్లోనూ మాస్క్ పెట్టుకోవాలా.? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.!
Follow us

|

Updated on: May 11, 2021 | 9:00 AM

Wear Mask In House: అసలే కరోనాకాలం.. ఆపై సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తోందో తెలియని పరిస్థితి. ఈ సమయంలో స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అటు కరోనా వైరస్ గాలిలో ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతుండటంతో బయటికి వెళ్ళినప్పుడే కాకుండా ఇంట్లోనూ మాస్క్ ధరించాలని వారు సూచిస్తున్నారు. 24 గంటలు మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తే.. పలు ప్రత్యేక సందర్భాల్లోనైనా మాస్క్ ధరించాలని అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • కుటుంబసభ్యుల్లో ఎవరికైనా దగ్గు, తుమ్ములు తదితర లక్షణాలు ఉన్నట్లయితే.. అందరూ కొన్ని రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి
  • ఇంట్లో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే.. ఇంటిల్లిపాదీ మాస్క్ ధరించాల్సిందే.!
  • ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని చూసుకుంటున్నట్లయితే మాస్క్ పెట్టుకోవడం మంచిది
  • ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే.. వారిని మాస్క్ ధరించమని చెప్పండి. అలాగే ఇరుగుపొరుగు వారితో మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!