Corona Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?.. నిపుణులేమంటున్నారు..?

Corona Effect: దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కరోనా బారిన పడితే కొంత ప్రమాదకరమైన విషయమే. అయితే అలాంటి వారి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..

Corona Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?.. నిపుణులేమంటున్నారు..?
Follow us

|

Updated on: May 11, 2021 | 6:16 AM

Corona Effect: దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కరోనా బారిన పడితే కొంత ప్రమాదకరమైన విషయమే. అయితే అలాంటి వారి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కరోనా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది వరకే దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలున్నవారు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. సాధారణ లక్షణాలున్న వారికి పాజిటివ్‌ వచ్చినా హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే వైరస్‌ బారి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

శ్వాస సమస్యలున్న వారికి ఎలాంటి ప్రభావం..

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకు ముందు ఊపిరితిత్తుల్లో వైరస్‌ సోకినా ఇంత ఉద్ధృతంగా లేదు. కరోనా ఇన్‌పెక్షన్‌ మొదట ఊపిరితిత్తుల్లో చేరి, అక్కడి నుంచి శరీరంలోకి వేర్వేరు అవయవాలకు వ్యాపిస్తుంది. ముందుగా దీనిని నిమోనియా అంటారు. ఈ వైరస్‌ వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుంది. ఆ తర్వాత వైరస్‌ అంతటా వ్యాపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, ఆయాసం వంటివి తలెత్తుతాయి. అయితే ఊపిరితిత్తులు 15 శాతం ఎఫెక్ట్‌ అయిన వాళ్లలో ఇబ్బంది ఉండదు. తీవ్రత పెరిగిన కొద్ది చికిత్సకు కష్టం అవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కరోనా వైరస్‌ తీవ్రతను మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌గా నిర్ధారిస్తారు. వ్యాధి లక్షణాలు లేకుండా మైల్డ్‌లో ఉన్న వారికి ఇబ్బంది ఉండదు. మైల్డ్‌ లక్షణాలు.. ఒళ్లు వెచ్చబడటం, కొద్దిగా తలనొప్పి వంటివి ఉన్నవారు పరీక్షలు చేసుకోవడం మంచిది. పరీక్షలు చేయించుకున్న తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉండి మందులను వాడితే సరిపోతుందంటున్నారు. అలాగే ఐసోలేషన్‌లో మోడరేట్‌ లక్షణాలు ఉన్నవాళ్లు ఆక్సిమీటర్‌తో పల్స్‌రేటు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఒక వేళ పల్స్‌ తక్కువగా ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించడం బెటర్‌.

అయితే వ్యక్తి క్రిటికల్‌ అని నిర్ధారించడానికి చాలా కారణాలున్నాయి. పల్స్‌రేటు పెరగడం, రెస్పిరేటరీ రేటు పెరగడం, ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గిపోవడం, కాన్సియస్‌ నెస్‌ తగ్గిపోవడం, రక్త పరీక్షల ద్వారా సిటీ స్కాన్‌ ద్వారా వచ్చిన రిజల్ట్‌ పరిశీలించి క్రిటికల్‌ దశగా నిర్ణయిస్తారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి ఐసీయూలో ఉంచాలి. ఇందులో దాదాపు 5-60 శాతం మందికి వెంటిలేటర్స్‌ అవసరం ఉండవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

కరోనా నుంచి కోలుకున్నాక ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?

కరోనా బారిన పడిన వారికి మొదట వచ్చిన తీవ్రతను బట్టి భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి. క్రిటికల్‌ దశలో ఉన్నవారికి తప్ప ఇతరులకు హైడోస్‌ మందులు ఇవ్వడం అంటూ ఉండదు. వ్యాధి లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి పది రోజులు మాత్రమే మందులు ఇస్తుంటారు. అందరికీ హైడోస్‌ ఇవ్వడం జరగదు కాబట్టి భవిష్యత్తులో సమస్యలు రావు. క్రిటికల్‌, అంతకు ముందు శ్వాస సంబంధించిన సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి భవిష్యత్తులో ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Aligarh Muslim University: 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లు కన్నుమూత.. ఐసీఎంఆర్‌కు లేఖ రాసిన యూనివర్సిటీ

Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం

Mask Vending Machine: మాస్క్‌ వెండింగ్‌ మెషీన్ చూశారా..? 5 రూపాయల నాణెం వేస్తే మాస్క్‌ బయటకు వచ్చేస్తోంది

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించనున్నారా.? నేడు జరగబోయే కేబినెట్‌ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు..?