Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించనున్నారా.? నేడు జరగబోయే కేబినెట్‌ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు..?

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో దూసుకుపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు..

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించనున్నారా.? నేడు జరగబోయే కేబినెట్‌ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు..?
Telangana State
Follow us
Subhash Goud

|

Updated on: May 11, 2021 | 6:04 AM

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో దూసుకుపోతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోందని పుకార్లు షికార్లు అవుతున్నాయి. అంతేకాదు ఈనెల 15 నుంచి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. కరోనాను అదుపులోకి తీసుకురావాలంటే లాక్‌డౌన్‌ విధించడం ఒక్కటే పరిష్కారమార్గమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18 గంటల పాటు కర్ఫ్యూ అమలు అవుతుంటే.. తెలంగాణలో మాత్రం నైట్‌ కర్ఫ్యూ మాత్రమే అమలవుతోంది. పగటి పూట అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండటంతో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్లు, ఆక్సిజన్‌ దొరకని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, లాక్‌డౌన్‌ విధించకుండానే కరోనాను కట్టడి చేద్దామన్న ప్రభుత్వ ఆలోచన బెడిసికొడుతోంది.

ప్రజల నిర్లక్ష్యం వల్లే..

కాగా, ప్రజలు నిర్లక్ష్యం వీడకపోతే లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి వస్తుంది. కొందరు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కారణంగా కరోనా వ్యాప్తికి కారణమవుతుందని ఇప్పటికే నిపుణులు, అధికారులు చెబుతున్నారు. పగలు కర్ఫ్యూలేని కారణంగా ప్రజలు స్వీయ నియంత్రణ లేకుండా వ్యవహరించడం, మాస్క్ ధరించకపోవడం, కనీసం భౌతిక దూరం కూడా పాటించకపోవడం కారణాల వల్ల ముందుముందు పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుని క్రమేణా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ విధంగా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో కేసులు నమోదు ప్రారంభమైతే పరిస్థితి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వైద్య రంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం.

కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌పై చర్చ..

కాగా, రాష్ట్రంలో కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌ పనితీరు, వ్యాక్సిన్ల లభ్యత, మొదటి డోసు కోసం కాకుండా రెండో డోసు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌ ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపనుందా..?

కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తే ధాన్యం కొనుగోళ్లపై ఎలాటి ప్రభావం చూపుతుందనే దానిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ భేటీ అనంతరం ఈనెల 15 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటిస్తే నగరంలో ఉన్న వలస కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు రెండు, మూడు రోజుల్లో వారి స్వస్థలాలకు వెళ్లడానికి అవకాశం లభిస్తుంది. ప్రజలు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వీలవుతుంది. ధాన్యం కొనుగోళ్లు క్రమబద్దీకరించడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్‌లో కీలక నిర్ణయం..

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై కేబినెట్‌ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా కరోనా వ్యాప్తి అంతగా తగ్గలేదన్న నివేదికలు ఉన్నాయని, కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించినా.. కరోనా వ్యాప్తి తగ్గడం లేదని, సరైన ఫలితాలు లేవని నివేదికలు అందుతున్నాయని, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే కొన్ని వర్గాలు లాక్‌డౌన్‌ విధించాలని కోరుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ఎదురయ్యే సమస్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఏదీ ఏమైనా లాక్‌డౌన్ విధిస్తారా..? లేక ఇంకేమైన ఆంక్షలు విధిస్తారా..? అనేది తెలియాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాలి.

ఇవీ కూడా చదవండి

Coronavirus: దండకారణ్యంలో కరోనా టెర్రర్‌.. మావోయిస్టులను వదలని కరోనా మహమ్మారి.. పోలీసుల బంపర్‌ ఆఫర్‌

COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ

Maharashtra Corona: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!