COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ

COVID-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే వైరస్‌ గాలి ద్వారాను వ్యాపిస్తుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు వెల్లడించిన విషయం..

COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ
Follow us

|

Updated on: May 10, 2021 | 6:11 AM

COVID-19: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే వైరస్‌ గాలి ద్వారాను వ్యాపిస్తుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. గాలిలో వైరస్‌ కణాలు ఎంత దూరం వ్యాప్తి చెందుతుందనే దానిపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) మరోసారి క్లారిటీ ఇచ్చింది. వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. అలాగే వెంటిలేషన్‌ లేని ప్రాంతాల్లో 6 అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తించే అవకాశాలున్నాయని తెలిపింది.

మూడు విధానాల్లో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి

ఈ కోవిడ్‌ వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి శ్వాసించినప్పుడు వెలువడే స్వల్ప శ్వాస బిందువుల ద్వారా వైరస్‌ వ్యాప్తి్స్తుందని ఇప్పటికే వెల్లడైంది. ఇది 3 నుంచి ఆరు అడుగుల లోపల ఈ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంటుందని సీడీసీ స్పష్టం చేసింది. 1. అతిచిన్న శ్వాసకోస కణాలను నేరుగా పీల్చడం 2. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు నేరుగా ఇతరుల ముక్కు, నోటి ద్వారా చేరడం 3. వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను నేరుగా చేతులతో తాకడం వల్ల వైరస్‌ మరొకరికి వ్యాప్తించే అవకాశాలు.

అయితే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విడుదలయ్యే సూక్ష్మ బిందువుల్లో కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నవి వేగంగా అంటే కొన్ని సెకన్లలోనే నేలపై పడిపోతాయి. కానీ అత్యంత స్వల్ప పరిమాణంలో ఉన్న కణాలు మాత్రం కొన్ని నిమిషాల పాటు గాల్లోనే ఉంటాయని వెల్లడించింది. అయితే అవి గాల్లో ఎంత సమయం ఉంటాయనేదానిపై ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, తేమ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని తెలిపింది. అయితే కరోనా సోకిన వ్యక్తి భౌతిక దూరం ఎక్కువగా ఉంటే ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ అని వెల్లడించింది.

మాస్క్‌, భౌతిక దూరమే కీలకం:

కరోనా నుంచి రక్షించుకోవడానికి ప్రధానంగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడమే కీలకమని సీడీసీ స్పష్టం చేసింది. సరిపడ వెంటిలేషన్‌ ఉండేటట్లు చూసుకోవాలని, ఇండోర్‌ ప్రాంతాల్లో గుంపులుగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!