హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!

Oxygen Shortage: కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. ఒక వైపు కరోనా బారిన పడి మృత్యువాత పడుతుంటే.. మరో వైపు సరైన ఆక్సిజన్‌ అందక మరి కొందరు మృతి చెందుతున్నారు.

హైదరాబాద్‌లో విషాదం.. ఆక్సిజన్‌ అందక కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి.. కారణం ఏంటంటే..!
Follow us

|

Updated on: May 09, 2021 | 10:34 PM

Oxygen Shortage: కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. ఒక వైపు కరోనా బారిన పడి మృత్యువాత పడుతుంటే.. మరో వైపు సరైన ఆక్సిజన్‌ అందక మరి కొందరు మృతి చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక రెండు గంటలుగా 20 మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. అధికారుల నిర్లక్ష్యం చూపారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ రవాణాలో ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు.

అయితే జడ్చర్ల నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్ రావాల్సి ఉంది. అయితే డ్రైవర్‌కు సరైన చిరునామా తెలియకపోవడంతో ట్యాంకర్‌ డ్రైవర్‌ ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిపోయాడు. దీనిపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసుల సహకారంతో కింగ్‌ కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరింది. ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఆస్పత్రికి ఆలస్యంగా చేరుకోవడంతో ముగ్గురు మరణించారు.

కాగా, ఇలా ఆక్సిజన్‌ కొరత వల్ల ఇప్పటికే దేశంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతుండగా, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఇక సరైన సమయంలో రోగులకు ఆక్సిజన్‌ అందక మరిన్ని మరణాలు సంభవిస్తుండటంతో భయాందోళన నెలకొంటోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణాలో కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన నెలకొంది.

ఇవీ  కూడా చదవండి:

Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?

AP Corona: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 22 వేలకు పైగా నమోదు.. మరణాలు..?

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ