CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెల్లరేష‌న్‌ కార్డుదారులంద‌రికీ ఉచిత బియ్యం..

Free Ration: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని

CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెల్లరేష‌న్‌ కార్డుదారులంద‌రికీ ఉచిత బియ్యం..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 09, 2021 | 10:10 PM

Free Ration: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలలపాటు ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేటు టీచ‌ర్ల‌కు అందించే సాయాన్ని మ‌రో 80 వేల మందికి అందించ‌నున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన మరో 80 వేల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి కూడా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వేగంగా చర్యలు తీసుకోవలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా వైద్య సిబ్బందిపై భారం తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకున్నారు. వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కరోనా వల్ల దుర్భర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజా సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారున్నారని.. ఆసక్తి ఉన్నవారంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సినన్ని బెడ్లు, ఔషధాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

వరంగల్‌ ఆదిలాబాద్‌ జిల్లాల్లో వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభించాలని ఆదేశించారు. అందుకు కావాల్సిన సిబ్బందిని సైతం తక్షణమే నియమించుకోవాలని సూచించారు. అలాగే వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న వర్గాలకు వీలైనంత త్వరగా టీకాలు ఇవ్వాలని సూచించారు. క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, కండక్టర్లు, ఎల్పీజీ డెలివరీ బాయ్స్, రోజువారీ వేతన కార్మికులను ప్రత్యేక కేటగిరీ పరిధిలోకి తీసుకువచ్చి టీకాలు వేయాలని సూచించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు, ప్రధాని మోదీకి అభ్యర్థించగా.. సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

Also Read:

ఢిల్లీ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్.. ఓ డాక్టర్ మృతి , కిక్కిరిసిన హాస్పిటల్స్

CORONA SECONDWAVE:40 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు.. అరుణాచల్ చంగ్లాంగ్‌లో 91.5 శాతం పాజిటివ్ కేసులు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?