AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONA SECONDWAVE:40 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు.. అరుణాచల్ చంగ్లాంగ్‌లో 91.5 శాతం పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. రోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదవుతుంటే.. నాలుగు వేల మందికి పైగా వైరస్ బారిన పడి మృత్యువు వొడిలోకి..

CORONA SECONDWAVE:40 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు.. అరుణాచల్ చంగ్లాంగ్‌లో 91.5 శాతం పాజిటివ్ కేసులు
40 Distircts
Rajesh Sharma
|

Updated on: May 09, 2021 | 4:54 PM

Share

CORONA SECOND WAVE IN INDIA POSITIVITY RATE HIGH: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (CORONA VIRUS) సెకెండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. రోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదవుతుంటే.. నాలుగు వేల మందికి పైగా వైరస్ బారిన పడి మృత్యువు వొడిలోకి చేరుకుంటున్నారు. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. అదే వేగంతో మరణాలు నమోదవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 40 జిల్లాల్లో 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు (POSITIVITY RATE) నమోదవుతోంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ (UNION HEALTH MINISTRY) గణాంకాలను మే 9న వెల్లడించింది. పన్నెండు రాష్ట్రాలలో 80 శాతం కరోనా కేసులుంటే.. అందులోని 40 జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఆందోళన రేకెత్తిస్తోంది.

దేశవ్యాప్తంగా 741 జిల్లాలుండగా.. అందులో 301 జిల్లాల్లో మే 1 నుంచి 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా వీటిలోని 15 జిల్లాల్లో 50 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు తెలిపింది. హర్యానా (HARYANA) రాష్ట్రంలోని నాలుగు, అరుణాచల్‌ ప్రదేశ్‌ (ARUNACHAL PRADESH)లో రెండు, రాజస్థాన్‌ (RAJASTHAN)లో రెండు జిల్లాలు సహా ఇతర రాష్ట్రాల్లోని మరో 7 జిల్లాల్లో సగానికిపైగానే అంటే యాభై శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఈ జిల్లాలన్నీ గ్రామీణ ప్రాంతానికి చెందిన జిల్లాలేనని తెలిపింది.. అనేక గ్రామీణ ప్రాంతాల్లో సరైన పరీక్షలు లేని కారణంగా కేసులు బయటపడటం లేదని తెలిపింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చంగ్లాంగ్‌ (CHANGLANG) జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉందని, ఇదే రాష్ట్రంలోని దిబాన్‌ వ్యాలీతోపాటు.. పుదుచ్చేరి (PUDUCHCHERY)లోని యానాం (YAANAM), రాజస్థాన్‌లోని బికనీర్‌, పాలీ జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేరళ (KERALA)లోని 14 జిల్లాలకు గాను 13 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాటిజివిటీ రేటు నమోదువుతోంది. హర్యానాలోని 22 జిల్లాలకు గాను 19, పశ్చిమ బెంగాల్‌ (WEST BENGAL)లోని 23కి 19, ఢిల్లీ (DELHI)లోని 11 జిల్లాలకు గాను.. 9, కర్ణాటక (KARNATAKA)లోని 31 కిగాను 24 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికిపైగా నమోదవుతోంది.

పలు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ (TOTAL LOCK-DOWN), మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ (LOCK-DOWN), రాత్రి కర్ఫ్యూ (CURFEW) విధిస్తున్నా.. కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. కొద్ది రోజులుగా దేశంలో 4 లక్షలకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. మే 9న వెల్లడించిన వివరాల ప్రకారం తాజాగా గత 24 గంటల్లో 4 లక్షల 3 వేల 738 మంది వైరస్‌ (VIRUS) బారిన పడగా.. 4,092 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 2 లక్షల 42 వేల 362 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు.