ఢిల్లీ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్.. ఓ డాక్టర్ మృతి , కిక్కిరిసిన హాస్పిటల్స్
ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గత నెల రోజుల్లో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది.వ్యాక్సిన్ తీసుకున్న ఏ.కె. రావత్ అనే డాక్టర్ నిన్న మరణించారు.
ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గత నెల రోజుల్లో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది.వ్యాక్సిన్ తీసుకున్న ఏ.కె. రావత్ అనే డాక్టర్ నిన్న మరణించారు. ఏప్రిల్-మే నెలల మధ్య 80 మంది మెడికల్ స్టాఫ్ పాజిటివ్ కి గురయ్యారని, శనివారం మరణించిన డాక్టర్ రావత్ తన జూనియర్ అని ఈ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.కె.భరద్వాజ్ తెలిపారు. నిజానికి రావత్ ఎంతో ధైర్య వంతులని, వ్యాక్సిన్ వేయించుకున్నాను గనుక త్వరలో కోవిడ్ నుంచి బయటపడతానని తనతో చివరిసారిగా అన్నారని ఆయన విచారంగా చెప్పారు. ఆయన దాదాపు కన్నీటి పర్యంతమయ్యారు. నగరంలోని ఆసుపత్రులన్నీ కోవిద్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ కొరత తీరిపోయినా కేసులు పెరిగిపోవడంతో అనూహ్య పరిస్థితి ఏర్పడింది. గత 24 గంటల్లో 273 మంది రోగులు మృతి చెందారు. అటు దేశంలో మూడో రోజూ వరుసగా 4,01,07 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 4,092 మంది రోగులు మృత్యుబాట పట్టారు. కానీ ఇదే సమయంలో 1,83,17,404 మంది రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,86,444 అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ప్రధాన రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితి ఇలా ఉంది. మహారాష్ట్రలో 54 వేలకు పైగా, కర్నాటకలో సుమారు 50 వేలు, కేరళలో 38 వేలకు పైగా, యూపీలో దాదాపు 30 వేలు, తమిళనాడులో 26,465 కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా దేశంలో కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తీవ్రంగా దుయ్యబట్టింది. ఆయన పొరబాట్లు క్షమార్హం కావని తన నివేదికలో పేర్కొంది.ఈ క్రైసిస్ సమయంలో తనపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఓపెన్ చర్చలు ఏ మాత్రం క్షంతవ్యం కావని ఘాటుగా విమర్శించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Calvary Temple: కోవిడ్ కేర్ సెంటర్‌గా.. కల్వరి టెంపుల్.. 300 పడకలతో ఏర్పాటు
Calvary Temple: కోవిడ్ కేర్ సెంటర్‌గా.. కల్వరి టెంపుల్.. 300 పడకలతో ఏర్పాటు