ఆక్సిజన్ సంక్షోభానికి ఢిల్లీ ప్రభుత్వానిదే బాధ్యత, బీజేపీ మండిపాటు, ఆప్ నేతలు బ్లాక్ మార్కెటీర్లుగా మారారని విమర్శ

ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ ఆరోపించింది. అధికార ఆప్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మెడికల్ ఆక్సిజన్...

ఆక్సిజన్ సంక్షోభానికి ఢిల్లీ ప్రభుత్వానిదే బాధ్యత, బీజేపీ మండిపాటు, ఆప్ నేతలు బ్లాక్ మార్కెటీర్లుగా మారారని విమర్శ
Arvind Kejriwal
Follow us

| Edited By: Phani CH

Updated on: May 09, 2021 | 6:07 PM

ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభానికి ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ ఆరోపించింది. అధికార ఆప్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మెడికల్ ఆక్సిజన్ ని, కోవిడ్ మందులను అక్రమంగా దాస్తున్నారని, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా దుయ్యబట్టారు. ఆక్సిజన్ లేక ఓ వైపు కోవిడ్ రోగులు, ఆస్పత్రులు నానా పాట్లు పడుతుండగా..వీరు మాత్రం ఇలా బ్లాక్ మార్కెటీర్లుగా మారారని ఆయన అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీతో బాటు ఆర్ ఎస్ ఎస్, ఇతర సేవా సంస్థలు కోవిడ్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాయని చెప్పారు. ఆక్సిజన్ ప్రొక్యూర్ మెంట్ కు తీసుకోవలసిన చర్యలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై గత మార్చి 6 వతేదీనే కేంద్రం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిందని, కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.కానీ ఇప్పుడు హాస్పిటల్స్ నుంచి ఒత్తిడి పెరిగేసరికి ప్రాణవాయువును ఎవరు ఇస్తారా అని ఈ సర్కార్ అందరి కాళ్లావేళ్లా పడుతోందని ఆదేశ్ గుప్తా ఎద్దేవా చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆప్ ఎమ్మెల్యే రాఘవ చద్దా ఖండిస్తూ.. నగరానికి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని ఇవ్వాలని సుప్రీంకోర్టు గట్టిగా ఆదేశించినప్పటికీ, కేంద్రం 499 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును మాత్రమే ఇచ్చిందని చెప్పారు. మీ కేంద్రం మాటేమిటని ఆయన బీజేపీని ప్రశ్నించారు. కాగా నగరానికి ఇప్పుడు ఆక్సిజన్ కొరత లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ వైపు స్పష్టం చేయగా,, ఈ ఎమ్మెల్యే ఇలా చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అటు-నగరంలోని 4 ఆసుపత్రుల నుంచి ఆక్సిజన్ కోసం కొన్ని ఎస్ ఓ ఎస్ సందేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక కోవిడ్ పరిస్థితి కొంత’చల్లబడిందని’ అంటున్నారు. కోవిడ్ మృతుల సంఖ్య గతవారంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు ఇది తగ్గింది. గత వారం వరుసగా మూడు రోజులపాటు 400 మందికి పైగా కోవిద్ రోగులు మృతి చెందగా తాజాగా 200 మందికి పైగా మరణించారని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఢిల్లీ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్.. ఓ డాక్టర్ మృతి , కిక్కిరిసిన హాస్పిటల్స్

IMA Lockdown: ఇప్పటికైనా మేల్కోండి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పెట్టండి.. ఐఎంఏ డిమాండ్‌.. ( వీడియో )