Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?

Coronavirus Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలో కూడా కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతోపాటు

Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?
Telangana Corona
Follow us

|

Updated on: May 09, 2021 | 8:05 PM

Coronavirus Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. తెలంగాణలో కూడా కోవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 55,358 నమూనాలను పరీక్షించగా 4976 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి పెరిగింది. దీంతోపాటు ఈ కరోనా మహమ్మారి కారణంగా 35 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకూ మరణించిన వారిసంఖ్య 2,739కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కరోనా నుంచి 7,646 మంది బాధితులు కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,28,865 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,757 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 86.22శాతం ఉండగా.. మరణాల రేటు 0.55శాతంగా ఉంది.

అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 851 కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 384, మహబూబ్‌నగర్‌లో 208 కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న నమోదైన కేసులతో పోల్చుకుంటే..తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కొంతమేర తగ్గింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళ కర్ఫ్యూను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

YS sharmila: కేసీఆర్ దొర.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చండి.. వైఎస్ షర్మిల డిమాండ్

Coronavirus: తెలంగాణ‌లోని ఈ గ్రామంలో ఒక్క క‌రోనా కేసు కూడా లేదు.. కార‌ణాలు ఏంటంటే

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..