Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్.. ఆసుపత్రిలో చేరిక

Covid-19: తెలంగాణలో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరగుతోంది. నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ

Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్.. ఆసుపత్రిలో చేరిక
Koppula Eshwar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 09, 2021 | 6:30 PM

Covid-19: తెలంగాణలో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరగుతోంది. నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కూడా కరోనా బారినపడ్డారు. కోవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. అయితే.. ముందుగా హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్న ఈశ్వర్ ఆతర్వాత.. ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.

కాగా.. కొప్పుల ఈశ్వర్ యశోద ఆస్పత్రిలో చేరారు. కరోనా నిర్ధారణ అయిన అనంతరం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగానే మంత్రి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కాగా అంతకుముందు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు.

Also Read:

YS sharmila: కేసీఆర్ దొర.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చండి.. వైఎస్ షర్మిల డిమాండ్

Coronavirus: తెలంగాణ‌లోని ఈ గ్రామంలో ఒక్క క‌రోనా కేసు కూడా లేదు.. కార‌ణాలు ఏంటంటే

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!