YS sharmila: కేసీఆర్ దొర.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చండి.. వైఎస్ షర్మిల డిమాండ్
YS sharmila on CM KCR: కరోనా చావులతోపాటు.. అప్పులతో నరకం అనుభవిస్తున్న జనాల సంఖ్య పెరిగిపోతుందని, దయచేసి ఇప్పటికైనా కరోనా వైద్యాన్ని
YS sharmila on CM KCR: కరోనా చావులతోపాటు.. అప్పులతో నరకం అనుభవిస్తున్న జనాల సంఖ్య పెరిగిపోతుందని, దయచేసి ఇప్పటికైనా కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని వైఎస్ షర్మిల కోరారు. కరోనాతో ప్రజలు ఆగమైపోతున్నారని.. ఆసుపత్రుల్లో అప్పులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులు కట్టనిదే.. శవాన్ని ఇచ్చే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. ఒకవైపు ఆస్తులను పోగొట్టుకొని కనీసం దహనసంస్కారాలకు కూడా డబ్బులు లేక, శవాలను సొంతూర్లకు తీసుకపోలేక.. అక్కడే అంత్యక్రియలు జరిపిస్తున్న దుస్థితి ఏర్పడిందని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.
బతుకులు ఆగమాయె’ పేరిట తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణలో రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక్కరైనా కరోనా బారినపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
షర్మిలా ట్విట్..
కరోనా చావులకన్నా .. అప్పులతో నరకం అనుభవిస్తున్న జనాల సంఖ్య పెరిగిపోతుంది. అయ్యా KCR దొర .. దయచేసి ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చండి.(2/2) @TelanganaCMO pic.twitter.com/l3Woudl4FA
— YS Sharmila (@realyssharmila) May 9, 2021
కరోనా చావులకన్నా.. అప్పులతో నరకం అనుభవిస్తున్న జనాల సంఖ్య పెరిగిపోతుంది.. అయ్యా కేసీఆర్ దొర.. దయచేసి ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చండి అంటూ షర్మిల ట్విట్ చేశారు.
Also Read: