Coronavirus: తెలంగాణ‌లోని ఈ గ్రామంలో ఒక్క క‌రోనా కేసు కూడా లేదు.. కార‌ణాలు ఏంటంటే

ఊళ్లో ఉన్నది కేవలం 11వందల మంది.. మనిషికి మనిషికి మధ్య.. ఊరికీ ఊరికీ ఉండేంత దూరం. అయినా సోషల్‌ డిస్టెన్సింగ్‌‌ను పాటిస్తున్నారు. మాస్కులు వేసుకుంటున్నారు.

Coronavirus: తెలంగాణ‌లోని ఈ గ్రామంలో ఒక్క క‌రోనా కేసు కూడా లేదు.. కార‌ణాలు ఏంటంటే
Coronavirus 6
Follow us
Ram Naramaneni

|

Updated on: May 09, 2021 | 6:15 PM

ఊళ్లో ఉన్నది కేవలం 11వందల మంది.. మనిషికి మనిషికి మధ్య.. ఊరికీ ఊరికీ ఉండేంత దూరం. అయినా సోషల్‌ డిస్టెన్సింగ్‌‌ను పాటిస్తున్నారు. మాస్కులు వేసుకుంటున్నారు. శానిటైజర్లు వాడుతున్నారు. కుగ్రామమే అయినా ఇంత వరకు ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు..ఇంతకీ ఈ గ్రామం ఎక్కడో తెలుసా..? మన తెలంగాణలోనే.. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మేడిపల్లి మండలం రాగోజిపేట్ లో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఓ చిన్న కుగ్రామమైనప్పటికీ కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ గ్రామస్తులు తీసుకుంటున్న జాగ్రత్తలే అందుకు కారణం.

రాగోజిపేట్ గ్రామంలో మొత్తం 382 గృహాలు ఉండగా, పదకొండు వందల యాభై మంది ఇక్కడ నివసిస్తున్నారు. వీరంతా కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ గ్రామంలో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో కేవలం మూడు కేసులు నమోదు చేసిన ఈ గ్రామంలో ఇప్పటివరకు సెకండ్ వేవ్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామస్తులంతా స్వీయ నియంత్రణ పాటించి, గ్రామంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకుని, ఎక్కడ ఎవరు గుమికూడి ఉండకుండా, కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామ సర్పంచ్ కూడా గ్రామస్తుల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.

పారిశుద్ధ్య కార్మికులతో హైపోక్లోరైడ్ చల్లించడం, డ్రైనేజీ పనులను, శానిటేషన్ వర్క్ ను దగ్గరుండి చూసుకోవడం చేస్తున్నారు సర్పంచ్. ఇక గ్రామం లోకి వచ్చే మార్గాలను మూసివేసి, ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే వారిని ఆపి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడమే కాకుండా, మాస్కులు, శానిటైజర్ ఇచ్చి ఎక్కువ సేపు గ్రామంలో ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి నిబంధనలు పాటిస్తే..అందరం త్వరలోనే తప్పక కోవిడ్ ఫ్రీగా జీవించే అవకాశం లేకపోలేదు అంటున్నారు పలువురు.

దీంతో పక్క గ్రామాల ప్రజల దృష్టి ప్రస్తుతం రాగోజిపేట్ గ్రామంపై పడింది. ఏది ఏమైనా కుగ్రామమే అయినప్పటికీ ఈ గ్రామస్తులు చేస్తున్న పని అన్ని గ్రామాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ చేస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుంది. కుగ్రామమే అయినప్పటికీ కరోనా కట్టడిలో సమర్థవంతంగా పని చేసిన ఈ గ్రామానికి, గ్రామస్తులకు, వారికి సహకరిస్తున్న గ్రామ సర్పంచ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Also Read : కోవిడ్ కేర్ సెంటర్‌గా.. కల్వరి టెంపుల్.. 300 పడకలతో ఏర్పాటు

ఢిల్లీ ఆసుపత్రిలో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్.. ఓ డాక్టర్ మృతి , కిక్కిరిసిన హాస్పిటల్స్

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్