అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే ఈ ఎనిమిది రకాల జ్యూస్‌లు తాగండి.. సునాయాసంగా బరువు తగ్గండి..!
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ మెయింటేన్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు.
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ మెయింటేన్, ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. అయితే, బరువు తగ్గడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, పండ్లు ఉపయోగపడుతాయి. కొన్ని రకాల పండ్ల రసాలు వ్యక్తులు త్వరగా బరువు తగ్గడానికి ఉపకరిస్తాయి. తక్కువ షుగర్ లెవెల్స్‌తో.. శరీరానికి అవసరైన పోషకాలను అందిస్తూ సరైన ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాటిని ముఖ్యంగా ఎనిమిది రకాల పండ్ల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ పండ్ల జ్యూస్ తాగడం వలన సులభంగా బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ ఎనిమిది రకాల జ్యూస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సెలరీ జ్యూస్.. సెలరీ జ్యూస్.. మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమైనది అని చెప్పాలి. తక్కువ కేలరీలు కలిగి ఉండి.. 95 శాతం కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు మనిషి బరువు తగ్గడానికి, శరీరంలోని చెడు కొవ్వు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గిస్తుంది.
2. బీట్ రూట్ జ్యూస్.. బీట్‌రూట్ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు, నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. రక్తనాళాలలో అడ్డంకులను తొలగిస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.
3. దానిమ్మ జ్యూస్.. శరీరం రిఫ్రెష్ అవడానికి దానిమ్మ పళ్ల రసం ఎంతగానో ఉపకరిస్తుంది. తక్కువ కేలరీలు కలిని ఈ జ్యూస్ తాగడం వల్ల శరీర బరువు సులువుగా, రిస్క్ లేకుండా తగ్గించుకోవచ్చు. అంతేకాదు.. ఈ జ్యూస్ బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది. షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులను ఇది తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది కూడా.
4. ఆకు కూరగాయల రసాలు.. ఆకు కూరలతో జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రుచికి తగినట్లుగా ఆకు కూరలతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల.. బరువు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకు కూరల్లో అన్ని రకాల పోషకాలతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. కొవ్వు పెరుగుదలను నియంత్రిస్తుంది.
5. పుచ్చకాయ జ్యూస్.. పుచ్చకాయ జ్యూస్.. మనిషి శరీరానికి ఎంతో ఉపయోగకరమైనది. తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. పొటాషియం వంటి ఆరోగ్యకరమైన సూక్ష్మ పోషకాలు పుచ్చకాయలో కలిగి ఉంటాయి. పుచ్చకాయలో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు, మిటమిన్లు ఏ, సి ఉంటాయి. అధికశాతం నీటిని కలిగిన ఉండే పుచ్చకాయ.. మనిషి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రోజూ 300 గ్రాముల చొప్పున 2 కప్పుల తాజా పుచ్చకాయ జ్యూస్ తాగిన వారిలో శరీర బరువు తగ్గి.. ఆరోగ్యవంతంగా మారినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
6. నిమ్మకాయ-అల్లం-ఆకు కూరల జ్యూస్.. నిమ్మకాయ-అల్లం-ఆకు కూరల జ్యూస్‌తో మనిషి సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. రిస్క్ లేకుండా అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. నిమ్మకాయ, అల్లం, ఆకు కూరలతో కలిపి చేసిన జ్యూస్‌లో అనేక పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియను సరిచేస్తాయి.
7. క్యారెట్ జ్యూస్.. క్యారెట్ అనేక పోషక పదార్థాలు ఉంటాయి. విటమిన్-ఎ, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీ ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు క్యారెట్ జ్యూస్ తాగినే ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
8. కేల్ ఆపిల్ జ్యూస్.. కేల్ ఆపిల్ జ్యూస్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో చెక్కర శాతం చాలా తక్కువ. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మానవుల్లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి ఉపకరిస్తుంది. ఆకలిని నియంత్రించడంతో పాటు.. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.