ఉసిరితో లాభాలెన్నో.. రోగ నిరోధక శక్తిని పెంచే దివ్య ఔషదం.. మందుల కంటే ఆమ్లా చేసే మేలు ఎంతో..
Amla Benefits: ఉసిరి... జుట్టు సంరక్షణకు సహయపడే సహజ వనరు. దీని వలన జుట్టుకు ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే ఈ ఉసిరి వలన కేవలం
Amla Benefits: ఉసిరి… జుట్టు సంరక్షణకు సహయపడే సహజ వనరు. దీని వలన జుట్టుకు ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే ఈ ఉసిరి వలన కేవలం జుట్టుకు మాత్రమే కాదండోయ్.. మన శరీరానికి కూడా అనేక లాభాలున్నాయి. వ్యాది నిరోధక శక్తిని పెంపోందించటంలో ఉసిరి అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు తెలిపారు. ఇక దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కూడా ఈ ఉసిరి సహయపడుతుంది. కరోనా భారిన పడిన వారికి తొలి రోజు నుంచి కోలుకునేంత వరకు వాడే మందుల జాబితాలో విటమిన్ సీతోపాటు పలు విటమిన్ల టాబెట్లు ఉంటున్నాయి. వీటిలో ప్రధానమైన సీ విటమిన్ కోసం టాబ్లెట్స్ వాడటం కంటే ఉసిరి కాయను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు నిపుణులు. దీంతో ప్రస్తుతం ఉసిరికి ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరిగింది.
ఇక మన దగ్గర ఉసిరి అసలు కొదువే లేదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లను నివారిస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రక్త కణాల హీనతను తగ్గించడంతోపాటు జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరి మంచి బూస్టర్ గా పనిచేస్తుందని డాక్టర్ కూడా సూచిస్తున్నారు. ఇందులో విటమిన్ సీ, కాల్షియం, పాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ కాంప్లెక్స్ తోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అలాగే డయాబెటిస్ ను అదుపులో ఉంచేందుకు ఈ ఉసిరి దివ్యఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం చెక్కర వ్యాధిని నియంత్రణలో ఉంచేందుకు సహయపడుతుంది. అలాగే గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఉసిరి కాయలను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకోవడం కూడా మంచిదే. తేనెతో కలిపి ఉసిరిని తీసుకుంటే ఆస్తమా, శ్వాస కోశ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక దేశంలో కరోనా సృష్టిస్తున్న మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు విడిచారు. దీంతో కరోనా భయంతో ప్రజలకు తమ ఆరోగ్యాలపై మరింత శ్రద్ధ ఏర్పడింది. ఇక వారి జీవన శైలీలోనూ మార్పులు జరిగాయి. జంక్ ఫుడ్ కాకుండా.. సహజ సిద్ధంగా దొరికే పండ్లు, కాయలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ఆసక్తి పెరిగింది. అందుకే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉసిరి ఉత్పత్తులు కూడా అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడడమే కాకుండా.. అనేక వ్యాధులను నయం చేస్తుంది.