Sleep Food: నిద్రలేమితో సతమతమవుతున్నారా.? అయితే పిస్తా తిని చూడండి.. మార్పు మీకే కనిపిస్తుంది..
Sleep Food: కంటి నిండా నిద్ర.. సగం రోగాలను నయం చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మారుతోన్న జీవనశైలి, పనివేళల...
Sleep Food: కంటి నిండా నిద్ర.. సగం రోగాలను నయం చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో నిద్రలేమితో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మారుతోన్న జీవనశైలి, పనివేళల కారణంంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీర్ఘ కాలంలో ఇది ఎన్నో ఇతర సమస్యలకు దారి తీస్తుంది. సరిపడ నిద్రలేకపోవడం శారీకర సమస్యలతో పాటు మానసిక సమస్యలకు కారణంగా మారుతోంది. నిద్రలేమికి చెక్ పెట్టడానికి చాలా మంది చాలా రకాల టిప్స్ చెబుతుంటారు. అయితే తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? నిద్రలేమితో సతమతమయ్యే వారు పిస్తా తినాలని సూచిస్తున్నారు వైద్యులు. రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త పిస్తా తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. పిస్తాలో నిద్ర ఉపక్రమనకు ఉపయోగపడే మెలటోనిన్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులోని పీయూష గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ ఆధారంగానే మన నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం పనితీరు ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో మెలటోనిన్ రాత్రి వేళల్లో ఎక్కువవుతాయి కాబట్టే మనకు నిద్ర వస్తుంది. దీంతో తీవ్ర నిద్రలేమితో బాధపడే వారికి వైద్యులు మెలటోనిన్ హార్మోన్‌ను కృత్రిమంగా అందిస్తుంటారు. అయితే ఇది అంతగా సూచించదగ్గ అంశం కాదు కాబట్టి.. సహజంగా మెలటోనిన్ లభించే పిస్తా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Corona Fear: కరోనా మహమ్మారితో మరో భయం..మానసికంగా నలిగిపోతున్న ప్రజలు..ఆందోళనతో అనారోగ్యం!