Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు.. ఉదయాన్నే ఉసిరి తింటే ఆ సమస్యలు పరార్‌..!

Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉసిరిలో విటమిన్‌ -సి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని పూడ్చడానికి..

Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు.. ఉదయాన్నే ఉసిరి తింటే ఆ సమస్యలు పరార్‌..!
Amla Health Benefits
Follow us
Subhash Goud

|

Updated on: May 14, 2021 | 6:20 AM

Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉసిరిలో విటమిన్‌ -సి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని పూడ్చడానికి, జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్దకం, మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఎంతో మేలని, ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉసిరికాయ ఉపయోగపడుతుంది. ఉసిరి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రించబడతాయి. ఉసిరి తినడం వల్ల చర్మ సమస్యలు, జట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులో సి విటమిన్ ఉండటం వల్ల చర్మ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.

ఉసిరిలో నారింజ పండ్ల కన్నా 20 శాతం ఎక్కువ విటమిన్‌ పోషకాలు ఉంటాయి. ఉసిరి చర్మపు ముడుతలను సైతం నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మన తరచూ ఉసిరిని తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఇలా కూడా తింటే మంచిదే..

మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేము కాబట్టి, దీనిని ఆహారంలో ఉడకబెట్టడం లేదా పచ్చడి చేయడం ద్వారా తినవచ్చు. తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్యులు.

బరువు తగ్గేందుకు..

ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సైతం నియంత్రించుకోవచ్చు. ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, ఈ రసం రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను తొలగించుకోవచ్చు. అలాగే ఉసిరి రసం చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద ఉసిరి రసం ఉంచడం వల్ల రంధ్రాలు పోతాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఉసిరి రసం తాగడం మంచిది. ఉసిరి రసం కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఇవీ కూడా చదవండి: Steam Inhalation: కరోనా కోసం అతిగా ఆవిరి పడితే ప్రమాదమే.. ముక్కు దిబ్బడ కోసమే పట్టాలి..!

Corona Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయా..?.. నిపుణులేమంటున్నారు..?

ఒత్తిడికి లోనైనప్పుడు కనిపించే లక్షణాలు.. ఒత్తిడిని జయించడం ఎలా..?: ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ కీలక సూచనలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే