Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అంటు వ్యాధిగా గుర్తించాలంటూ రాష్ట్రాలకు లేఖ.. కీలక సూచనలు

Black Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుందటే మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ మరింత భయపెడుతోంది. ఏడాది కాలంగా జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న..

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్రం కీలక ప్రకటన.. అంటు వ్యాధిగా గుర్తించాలంటూ రాష్ట్రాలకు లేఖ.. కీలక సూచనలు
Black Fungus
Follow us
Subhash Goud

|

Updated on: May 20, 2021 | 4:59 PM

Black Fungus: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుందటే మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌ మరింత భయపెడుతోంది. ఏడాది కాలంగా జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి.. ఈ ఏడాది సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇక దీనికి తోడు బ్లాక్‌ ఫంగస్‌ వచ్చి చేరింది. దీని వల్ల కొందరి ప్రాణాలు సైతం పోయాయి. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిని వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బ్లాక్‌ ఫంగస్‌ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ రాస్తూ పలు సూచనలు చేసింది. ఇటువంటి కేసులను గుర్తించిన వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ ఫంగస్‌ కేసలు ఎక్కువగా ఉన్నది భారత్‌లోనే అని చెప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్‌ ఫంగస్‌ హడలెత్తిస్తోంది. దీనికి సరైన మెడిసిన్‌ అందుబాటులో లేకపోవడంతో వ్యాధి సోకిన వారు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

దేశంలో ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా భయాందోళనకు గురించేస్తోంది. రెండు మహమ్మారులు కూడా ప్రజలపై ముప్పేట దాడి చేస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. ఎక్కువగా బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్ ) కోవిడ్ నుంచి కోలుకున్న వారిని చుట్టుముడుతోంది. ఈ నేపథ్యంలో మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ను రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. అయితే వీరందరికీ చికిత్స అందించేందుకు ప్రభుత్వం జైపూర్‌లోని సవాయ్‌మన్ సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించింది. ఈ మేరకు రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

Heart Pain: గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం.. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ..!

Children Covid-19: పిల్లల్లో కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి..? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే..!