Heart Pain: గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం.. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ..!

Heart Pain: ఏ జీవి శరీరంలో అయినా అతి ప్రధానమైనది గుండె. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని..

Heart Pain: గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం.. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ..!
Follow us
Subhash Goud

|

Updated on: May 20, 2021 | 4:27 PM

Heart Pain: ఏ జీవి శరీరంలో అయినా అతి ప్రధానమైనది గుండె. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గుండెకు రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం కారణంగానే జరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే గంటలోనే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే ప్రయోజనం ఉంటుందని, చాలా కేసులలో బాధితులకు ఛాతినొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రికి చేరుకోగల్గుతున్నారని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పేర్కొంటున్నారు.

సాధారణంగా ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంట సేపటి వరకు కూడా శరీరంలో రక్తం సరఫరా జరుగుతుందని, మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన వెంటనే ఆస్పత్రికి చేరుకోవడం మేలని అంటున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డన్‌ అవర్‌ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ప్రతి రోజు వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండటం, పొగాకు దూరంగా ఉండటం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో గుండె నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య చాలా పెరిగిపోతోంది. గుండెపోటు వచ్చిన వారు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడే వారు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందుడం మేలంటున్నారు. గుండెనొప్పి రావడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు వైద్యులు. ముఖ్యంగా టెన్షన్‌కు గురి కావడం, ఒత్తిడి, అధిక ఆలోచన ఇలా రకరకాల ఒత్తిళ్లకు గురయ్యే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుండె నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Health Insurance: కరోనా సంక్షోభంలో పెరిగిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు.. 25-30 శాతం పెరిగిన బీమా ప్రీమియంలు..!

Children Covid-19: పిల్లల్లో కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి..? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే..!