పెళ్ళికి వచ్చి ‘కప్ప గంతులేశారు’, లాక్ డౌన్ రూల్సా ? మజాకా ? మధ్యప్రదేశ్ లో ఉల్లంఘనులకు పోలీసులు వేసిన ‘వింత శిక్ష’ ! చూడాల్సిందే !

లాక్ డౌన్ అంటే లాక్ డౌనే ! రూలంటే రూలే ! ఈ కోవిడ్ మహమ్మారి టైం లో తప్పనిసరిగా గైడ్ లైన్స్ పాటించాలని కేంద్రం పదేపదే మాటిమాటికీ చెబుతూ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా జనాలకు బేఫికర్ ! యధేచ్చగా వాటిని ఉల్లంఘిస్తున్నారు......

పెళ్ళికి వచ్చి 'కప్ప గంతులేశారు', లాక్ డౌన్  రూల్సా ? మజాకా ? మధ్యప్రదేశ్ లో ఉల్లంఘనులకు  పోలీసులు వేసిన 'వింత శిక్ష' ! చూడాల్సిందే !
Viral
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 20, 2021 | 6:00 PM

లాక్ డౌన్ అంటే లాక్ డౌనే ! రూలంటే రూలే ! ఈ కోవిడ్ మహమ్మారి టైం లో తప్పనిసరిగా గైడ్ లైన్స్ పాటించాలని కేంద్రం పదేపదే మాటిమాటికీ చెబుతూ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా జనాలకు బేఫికర్ ! యధేచ్చగా వాటిని ఉల్లంఘిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఓ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఆ తరువాత ‘వింత ‘విందు శిక్ష’ అనుభవించక తప్పలేదు. ఈ జల్లాలోని ఉమారి అనే గ్రామంలో జరిగిన వివాహానికి సుమారు 300 మందికి పైగా హాజరయ్యారు. ఇప్పుడు జరిగే ఇలాంటి తంతులకు 50 మందికి మించి హాజరు కారాదన్న రూల్ ఉంది. కానీ దాన్ని తుంగలో తొక్కి పొలోమంటూ పెద్ద సంఖ్యలో వీళ్లంతా అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు ఈ సమాచారం ఎలా తెలిసిందోగానీ బిలబిలమంటూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళను చూడగానే చాలామంది పారిపోగా దాదాపు 17 మంది మాత్రం పట్టుబడిపోయారు. వీరిని ఖాకీలు ఓ పొలం పక్కన రోడ్డుపైకి తీసుకుపోయి శిక్షగా వారి చేత కప్ప గంతులు వేయించారు. మధ్యలో సరిగా ‘ పర్ఫామ్ ‘చేయలేకపోయిన ఓ ఉల్లంఘనుడిపైకి సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసాయన లాఠీ ఎత్తాడు. నలుగురైదుగురు పోలీసులు వాచ్ చేస్తుండగా ఈ పనిష్మెంట్ అమలయింది. మళ్ళీ ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తే ఇంకా తీవ్రంగా శిక్షిస్తామని ఖాకీలు హెచ్చరించి వారిని వదిలేశారు.

బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలో అయితే ఇలా లాక్ డౌన్ అతిక్రమించినవారిని ఓ మార్కెట్ మధ్యలో రోడ్డుమీద కొంతదూరం మోచేతుల మీద పాకించారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో ) మధ్యదరా స‌ముద్రంలో ఘోరం….!! ప‌డ‌వ మునిగి 57 మంది మృతి… ( వీడియో )

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!