AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్.. స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన బన్నీ..

Allu Arjun: కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. దర్శక నిర్మాతలు ప్రాణాలు కోల్పోగా..

తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్.. స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన బన్నీ..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: May 21, 2021 | 9:05 PM

Share

Allu Arjun: కరోనా వైరస్.. సినీ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. దర్శక నిర్మాతలు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సెలబ్రెటీలు తమ ఆత్మీయులను పోగొట్టుకోని తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఇక ఈ వైరస్ స్టార్ హీరోలను సైతం ఇబ్బంది పెడుతుంది. భాషతో సంబంధం లేకుండా.. అటు బాలీవుడు, ఇటు టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోలను సైతం ఈ వైరస్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. అందులో ఇటీవలే అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకోగా.. ఎన్టీఆర్ ప్రస్తుతానికి హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ వైరస్ బారిన పడి కోలుకున్న నటీనటులంతా.. తమతోపాటు.. తమ కుటుంబ సభ్యులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయించారు. తన టీంలోని 45 ఏళ్లు పైబడిన వారికి… వారి కుటుంబ సభ్యులకు కూడా టీకా వేయించారు. అంతేకాదు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి మరీ స్వయంగా బన్నీనే చూసుకుంటున్నారు. టాలీవుడ్ అగ్రహీరోలలో సొంతంగా టీమ్ ఉన్న నటులలో అల్లు అర్జున్ ఒకరు. వారి బాగోగులు.. కుటుంబ సభ్యుల బాగోగులను తానే చూసుకుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్.. లెక్క మాస్టారు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ పూర్తిగా డీ గ్లామర్ రోల్ లో పుష్ప రాజ్ గా నటిస్తున్నాడు. బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలోనే బన్నీ కరోనా బారిన పడ్డారు.

Also Read: ప్రాణ స్నేహితులు కలుసుకున్నారు.. వాళ్లిద్దరిని చూస్తుంటే ముచ్చటేసింది.. రజినీ-మోహన్ బాబుపై మంచు లక్ష్మి ట్వీట్..

మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఈసారి పవన్ కోసం భారీ స్కెచ్.. సరికొత్త పాత్రలో కనిపించనున్న పవర్ స్టార్ ?

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!