ప్రాణ స్నేహితులు కలుసుకున్నారు.. వాళ్లిద్దరిని చూస్తుంటే ముచ్చటేసింది.. రజినీ-మోహన్ బాబుపై మంచు లక్ష్మి ట్వీట్..

సూపర్ స్టార్ రజినీ కాంత్.. టాలీవుడ్ అగ్ర హీరో మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిన విషయమే. వీరిద్ధరు కలసి నటించిన సినిమా

ప్రాణ స్నేహితులు కలుసుకున్నారు.. వాళ్లిద్దరిని చూస్తుంటే ముచ్చటేసింది.. రజినీ-మోహన్ బాబుపై మంచు లక్ష్మి ట్వీట్..
Mohan Babu Rajini
Follow us
Rajitha Chanti

|

Updated on: May 21, 2021 | 7:44 PM

సూపర్ స్టార్ రజినీ కాంత్.. టాలీవుడ్ అగ్ర హీరో మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిన విషయమే. వీరిద్ధరు కలసి నటించిన సినిమా పెదరాయుడు అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. వీరిద్ధరి స్నేహం గురించి చాలా సార్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాణస్నేహితులిద్దరూ కలుసుకున్నారు. రజినీ కాంత్ ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం అణ్ణాత్తే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ రజినీ కాంత్ తో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న రజినీ… ఆ తర్వాత తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు.

అక్కడే రెండు రోజుల పాటు సంతోషంగా గడినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రజినీ చెన్నై వెళ్లిపోయారు. ఆ సమయంలో రజినీ కాంత్, మోహన్ బాబు, మంచి విష్ణు, మంచు లక్ష్మీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ కలిసిన వేళ అంటూ మంచి విష్ణు ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ స్టార్ హీరోలిద్దరూ వైట్ అండ్ వైట్ డ్రెస్సులలో మెరిసిపోతూ కనిపించారు. అయితే ఈ ఫోటోలపై మంచు లక్ష్మి కామెంట్ చేస్తూ.. స్నేహానికి ఉన్న గొప్పదనాన్ని చెప్పారు. కాలం గడుస్తున్న కొద్దీ స్నేహానికి ఉన్న అర్థం మారిపోతోంది. మనం ఎవరితో కలిసి పెరుగుతామో వారు మన స్నేహితుల్లా ఎల్లకాలం ఉండకపోవచ్చు..కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రాంతాలకు వెళ్లినప్పుడు కలిసిన వారు మళ్లీ స్నేహితులుగా మారిపోవచ్చు. ఇత ఎంత ఎదిగినా ఎక్కడున్నా కూడా స్నేహబంధం మాత్రం మారదని వీరిద్దరిని (మోహన్ బాబు, రజినీకాంత్) చూస్తే నాకు తెలుస్తోంది. ఒకే టీని ఇద్దరూ కలిసి పంచుకుని తాగడం, కారు షెడ్లలో విలువైన సమయాన్ని గడపడం, ప్రస్తుతం వారిద్దరూ వారి వారి పరిధిలో స్టార్స్.. అయినా కూడా ఇద్దరూ కొంత సమయాన్ని గడిపేందుకు వీలుచేసుకున్నారు. మాట్లాడుకుంటున్నారు. బాధల్లో ఉంటే ఓదార్చుకుంటున్నారు. వాళ్లిద్దరూ అలా వాకింగ్ చేస్తూ వెళ్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటేసింది..వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఆ దేవుడికే తెలియాలి.. అయితే స్నేహబంధంలోని స్వచ్చత అంటే ఇదే అని నాకు తెలిసింది. వీరిద్దరి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్ చేశారు.

ట్విట్..

Also Read: మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఈసారి పవన్ కోసం భారీ స్కెచ్.. సరికొత్త పాత్రలో కనిపించనున్న పవర్ స్టార్ ?

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో