Night Dinner: రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.! అయితే డేంజరే.!! ఈ విషయాలు తెలుసుకోండి..
Eating Dinner Late At Night: ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడు తింటున్నామో.. ఎప్పుడు పడుకుతున్నామో..
Eating Dinner Late At Night: ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడు తింటున్నామో.. ఎప్పుడు పడుకుతున్నామో తెలియట్లేదు. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకుందాం అంటే ఏదో ఒక పని వచ్చి పడుతుంది. దానితో ప్రతిసారి ఆలస్యంగానే భోజనం చేస్తుంటాం. ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే నిద్రపోవడం, లేకపోతే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతామని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒక్క బరువు పెరగడమే కాదు.. దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా రాత్రి పూట 9 గంటల తర్వాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. అందుకే 9 గంటల లోపే భోజనం ముగిస్తే మంచిదని వారు అంటున్నారు. అంతేకాకుండా ఆలస్యంగా భోజనం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు కూడా వస్తాయన్నారు. అందుకే రాత్రి పూట పడుకోబోయే మూడు గంటల ముందు ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు. దీని వల్ల అరుగుదలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని.. అంతేకాకుండా నిద్ర కూడా సరిగ్గా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!