Air Cooler: ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.!
ఎండాకాలం వస్తే చాలు.. విపరీతమైన ఉక్కబోత, చెమట వల్ల ఎక్కువగా ఏసీని వాడుతుంటాం. ఇంతవరకు బాగానే ఉందిగానీ..
ఎండాకాలం వస్తే చాలు.. విపరీతమైన ఉక్కబోత, చెమట వల్ల ఎక్కువగా ఏసీని వాడుతుంటాం. ఇంతవరకు బాగానే ఉందిగానీ కొంతమందైతే ఇతర కాలాల్లో కూడా ఏసీ వాడుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కార్యాలయాలు, సాఫ్ట్‌వేర్ హబ్‌ల గురించి వేరేగా చెప్పనక్కర్లేదు.. కాలం ఏదైనా 24 గంటలు అక్కడ ఏసీలు పని చేస్తూనే ఉంటాయి. కొందరు ఏసీలకు బాగా అలవాటుపడితే.. మరికొందరు దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ చల్లదనం సహజసిద్దమైనది కాదు కాబట్టి.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఏసీల్లో ఉండటం వల్ల ప్రయోజనాల కంటే.. నష్టాలే ఎక్కువని వారు అభిప్రాయపడుతున్నారు.
నష్టాలివే…
- Dry Eyes… ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఈ సమస్య ఉంది. దీని వల్ల కళ్ళలో మంటలు, కళ్ళకు దురదలు వంటివి ఎక్కువవుతాయి. వీటికి ప్రధాన కారణం ఏసీలో ఎక్కువసేపు ఉండటమే.
- ఏసీ ఆన్ చెయ్యగానే తలుపులు మూసేస్తాం. అందువల్ల మనం రిలీజ్ చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను మళ్ళీ మనమే పీల్చుతూ ఉంటాం. దీనితో ఆక్సిజన్ తక్కువే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అది మైగ్రేన్‌గా మారితే.. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి తల బద్దలైపోతున్నట్లు అనిపిస్తుంది.
- ఏసీ వల్ల లోబీపీ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బాడీ త్వరగా అలిసిపోతుంది.
- ఏసీలో కూలింగ్ ఎంత పెరిగితే.. బాడీకి అంత ప్రమాదం. చల్లదనం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి.. ఎక్కువగా నీరు తాగాల్సి వస్తుంది.
- ఏసీలో ఎక్కువగా ఉండేవారు.. అధిక శాతం నీరు తాగకపోతే, వాళ్లకు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వస్తుంది.
- ఏసీ వల్ల చర్మం పొడిబారిపోతుంది. ఇక అప్పుడు మనం ఏదో ఒక క్రీము వాడాల్సి వస్తుంది.
- ముక్కు దిబ్బడ, గొంతు గరగర, వైరల్ అలర్జీస్ లాంటివి ఏసీలో ఎక్కువ ఉండటం వల్ల వ్యాపిస్తాయి.
- ఏసీ వల్ల ఆస్తమా లాంటి దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు.
- నీరసం, నిస్సత్తువ, డిప్రెషన్ వంటి సమస్యలు కృత్రిమ చల్లదనాన్ని ఇచ్చే ఏసీల వల్లే వ్యాపిస్తాయి.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!