Dust Storm: అసలు ఢిల్లీ మహా నగరానికి ఏమయింది… ఓ వైపు దుమ్ము, మరో వైపు ధూళి..
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నగరాన్ని ధూళి తుపాన్ ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలుచోట్ల దుమ్ము వ్యాపించడంతో బారెడు పొద్దెక్కినా చీకటి అలుముకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ నగరాన్ని ధూళి తుపాన్ ముంచెత్తింది. దీంతో ఢిల్లీలోని పలుచోట్ల దుమ్ము వ్యాపించడంతో బారెడు పొద్దెక్కినా చీకటి అలుముకుంది. దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడ కరోనా మహమ్మారి వ్యాప్తితో గజగజ వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి మరోవైపు భయపెడుతోంది. తాజాగా ఆదివారం ఉదయం నుంచి అక్కడి వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దుమ్ము, ధూళీతో రోడ్లన్నీ కనిపించకుండా పోయాయి. ఆదివారం ఉదయం కాలనీలు మొత్తం దుమ్ముతో నిండిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుమ్ము, ధూళీ వీస్తుండటంతో.. ఇంటి తలుపులు తీసేందుకు కూడా జనం వణికిపోయారు.
ఢిల్లీతోపాటు నోయిడా, అక్షర్ ధామ్‌లోని చాలా ప్రాంతాలు ఈ దుమ్ము గాలులు చుట్టేశాయి. దీంతో ఆక్షీజన్ కోసం ఇబ్బందులు పడుతున్న జనం ఇది చూసి మరింత భయపడిపోయారు.
Delhi: Dust shrouds parts of the national capital leading to decreased visibility.
Visuals from ITO (in pic 1), Akshardham (in pic 2) and Delhi-Noida Direct (DND) flyway (in pic 3) pic.twitter.com/ub7lu5zkQW
— ANI (@ANI) May 23, 2021