Black Fungus: బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే కరోనా నుంచి కోలుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. సూచిస్తున్న దంతవైద్యులు..

Black Fungus: బ్లాక్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్.. ఇప్పుడు కరోనా తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. కరోనా నుంచి కోలుకున్న రోగులకు ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్

Black Fungus: బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే కరోనా నుంచి కోలుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. సూచిస్తున్న దంతవైద్యులు..
Black Fungas
Follow us

|

Updated on: May 23, 2021 | 12:44 PM

Black Fungus: బ్లాక్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్.. ఇప్పుడు కరోనా తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే. కరోనా నుంచి కోలుకున్న రోగులకు ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ ప్రాణ సంకటంగా మారింది. మూకోర్మైకోసిస్ అనే ఈ ఫంగస్ ప్రస్తుతం కరోనా సోకిన వారిలో మాత్రమే కనిపిస్తుంది. చాలా కాలం వరకు స్టెరాయిడ్స్ తీసుకున్న రోజులకు, ఆసుపత్రిలో చేరిన రోగులు, ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్న రోగులలో సాధారణంగా కనిపించే లక్షణమే ఈ బ్లాక్ ఫంగస్. శుభ్రత పాటించని వారికి, డయాబెటిస్ రోగులు, ఇతర వ్యాధులు ఉన్నవారికి సమయానికి చికిత్స చేయకపోతే… ఈ బ్లాక్ ఫంగస్ ప్రాణాలను తీస్తుంది. అయితే కరోనా మందులు శరీరాన్ని బలహీనంగా మార్చడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఇక డయాబెటిస్, డయాబెటిస్ లేని కోవిడ్ రోగులలోని రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతాయి. ఇవి బ్లాక్ ఫంగస్ లక్షణాలు. అయితే ఈ బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండటానికి.. వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. కొన్ని దంత పరిశుభ్రత నియమాలను పాటించాలని డెంటిస్ట్స్ సూచిస్తున్నారు.

కోవిడ్ నుంచి కోలుకుంటున్న లేదా కోలుకున్న వ్యక్తులలో ఈ బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృవీకరించింది. ఐసీయులో ఆక్సిజన్ థెరపీ చేయించుకునే వ్యక్తులు, తేమకు గురికావడం వలన హ్యూమిడిఫైయర్ వాడతారు. అందువలన ఆక్సిజన్ చికిత్స కోసం శుభ్రమైన నీటిని ఉపయోగించాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అలాగే బలహీనమైన రోగ నిరోధక శక్తి, స్టెరాయిడ్లను ఎక్కువగా వాడడం వలన ఒరికోనజోల్ థెరపీ, మధుమేహం నియంత్రణలో లేకపోవడం వలన బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు.. నాలుక, చిగుళ్లు, ముక్కు, తీవ్రమైన నొప్పి, ముఖం వాపు, కళ్ల కింద బరువుగా అనిపించడం.. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

చిట్కాలు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత స్టెరాయిడ్లు, ఇతర మందులను తీసుకోవడం వలన నోటిలోని బ్యా్క్టీరియా, ఫంగస్ పెరగడానికి..సైనస్, ఉపిరితిత్తులు, మెదడులో సమస్య ఏర్పడుతుంది. రోజుకు రెండుసార్లు, మూడు సార్లు బ్రస్ చేయడం… నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారు టూత్ బ్రష్ మార్చుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా నోటితో లిక్విడ్ తో శుభ్రం చేసుకోవాలి. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి బ్రష్ లను ఇతరులు వాడే బ్రష్‏లను ఒకచోట ఉంచకూడదు. క్రిమినాశన మౌత్ వాష్ ఉపయోగించి.. క్రమం తప్పకుండా.. బ్రష్, టంగ్ క్లీనర్ శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు… 400 మిలియన్ లైక్స్ సాధించిన బుట్ట బొమ్మ సాంగ్..

సినీ జీవితం చాలా నేర్పించింది… నమ్మకద్రోహులకు దూరంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.. చంద్రమోహన్..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ