రండి బాబు… రండి..! టీకా తీసుకోండి…! కోట్ల డాలర్లు గెలుచుకోండి..! ఆఫర్లు ప్రకటించిన అమెరికా సర్కార్

Vaccine Drive in US: భారత్‌లో... టీకా కేంద్రాల వద్ద "నో స్టాక్‌ బోర్డులు" చూసి నిరాశతో తిరిగి వెళుతున్న బోర్డులు ... అమెరికాలో... రండి..! రండి..! టీకా వేయించుకుంటే మీకు బీరు ఇస్తాం.., లాటరీ టిక్కెట్లు ఇస్తాం.. అని ఆఫర్లు ఇస్తున్న బోర్డులు కనిపిస్తున్నాయి.

రండి బాబు... రండి..! టీకా తీసుకోండి...! కోట్ల డాలర్లు గెలుచుకోండి..! ఆఫర్లు ప్రకటించిన అమెరికా సర్కార్
Million Dollar Lottery And
Follow us

|

Updated on: May 23, 2021 | 7:46 PM

భారత్‌లో… టీకా కేంద్రాల వద్ద “నో స్టాక్‌ బోర్డులు” చూసి నిరాశతో తిరిగి వెళుతున్న బోర్డులు … అమెరికాలో… రండి..! రండి..! టీకా వేయించుకుంటే మీకు బీరు ఇస్తాం.., లాటరీ టిక్కెట్లు ఇస్తాం.. అని ఆఫర్లు ఇస్తున్న బోర్డులు కనిపిస్తున్నాయి. అవును, అమెరికాలో టీకా వేయించుకునేలా ప్రజలను ఒప్పించడానికి అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోంది. గత నెల రోజులుగా అమెరికాలో టీకాలు వేయించుకునే ప్రజల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వాలే ఆఫర్లు ఇవ్వడం మొట్టాయి.

అమెరికాలో ఇప్పటికే 58 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తయింది. జూలై 4 నాటికి 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని బైడెన్‌ సర్కారు ప్రణాళికలు. జూలై కి 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలకు అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చాడు. వ్యాక్సిన్‌ వచ్చిన కొత్తలో ప్రజలు అత్యధికంగా ఉత్సాహం చూపించినప్పటికీ ప్రస్తుతం ఆ జోరు కొద్దిగ తగ్గింది. దేశంలో మిగులు వ్యాక్సన్లు ఉన్నప్పటికీ గత నెలరోజులుగా మందకొడిగా వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. ముఖ్యంగా యువత వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో వారి ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను వెతుకుతోంది అమెరికా ప్రభుత్వం.

న్యూయార్క్‌లో గవర్నర్‌తో భోజనం…

టీకా వేసుకున్న 18 ఏళ్లు పైబడిన వారు ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుంటే లాటరీ తీసి విజేతలను ఎంపిక చేస్తారు. ఎంపికయినవారు రాష్ట్ర గవర్నర్‌ దంపతులతో కలసి వారింట్లోనే భోజనం చేసే బంపర్ ఆఫర్ అంటూ ప్రకటనలు జారీ చేస్తోంది అక్కడి ప్రభుత్వ యంత్రాంగం.

ఒహైయో గవర్నర్‌ ఆఫర్‌…

టీకా వేయించుకున్నవారిలో అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్‌ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీల్లో రూ. 7.3 కోట్లు బహుమానం అంటూ ప్రకటించారు ఒహైయో గవర్నర్‌. 18 ఏళ్లు నిండి కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని  గవర్నర్‌ మైక్‌ డివైన్‌ స్వయంగా ప్రకటించారు. అయితే లాటరీ పద్దతని తీసుకొచ్చారు. లాటరీ విజేతకు డబ్బులు ఇవ్వరు. ఏడాదిపాటు స్కూల్‌ స్కాలర్‌షిప్‌ ఇస్తారు. అమెరికాలోని ఈ రాష్ట్రంలో విద్య అత్యంత ఖరీదు కాబట్టి టీకా కోసం ప్రజలు ముందుకు వస్తారని ఇలా ప్లాన్ చేశారు.

వెస్ట్ వర్జీనియాలో…

టీకాలు తీసుకునే 16 నుండి 35 సంవత్సరాల వయస్సు గల స్థానికులకు రాష్ట్రం ప్రభుత్వం 100 డాలర్ల పొదుపు బాండ్లను అందిస్తుందని గవర్నర్ జిమ్ జస్టిస్ ప్రకటించారు. ఇక అక్కడి ప్రభుత్వ పెద్దలు మాత్రమే కాదు ఆ రాష్ట్రంలోని పెద్ద పెద్ద కంపెనీలు సైతం ప్రోత్సాహాలను ఇస్తున్నాయి. ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు , ఫార్మసీలు, రెస్టారెంట్లు, బ్రూవరీస్, సూపర్ మార్కెట్లు మరియు క్రీడా బృందాలతో భాగస్వామ్యం పెట్టుకొని కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రోత్సాహకాలను అందిస్తూ, ప్రజలకు బంపర్ ఆఫర్ లు ఇస్తూ ముందుకు వెళుతున్నారు.

మేరీలాండ్‌లో గవర్నర్ మరో ఆఫర్…

మేరీలాండ్ గవర్నర్ కూడా దాదాపు ఇటువంటి ఆఫర్నే  యువతకు ఆఫర్ చేశారు. ఇదిలా ఉంటే.. క్రిస్పీ క్రీమీ అనే రెస్టారెంట్ కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా యువతను పోత్రహిస్తోంది. వ్యాక్సినేషన్ కార్డుతో తమ స్టోర్‌కు వచ్చిన యువతకు ఫ్రీగా డోనట్‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

న్యూజెర్సీలో…

గవర్నర్ ఫిల్ మర్ఫీ టీకాలను ప్రోత్సహించడానికి “షాట్ అండ్ ఎ బీర్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా మే నెలలో టీకా మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చు అని చెప్పిన గవర్నర్‌

ఆఫర్లే… ఆఫర్లు…!

ఉబర్‌, లిఫ్ట్‌ రవాణా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది బైడెన్‌ ప్రభుత్వం. టీకా వేయించుకోవడానికి వచ్చేవారిని ఈ సంస్థలు తమ వాహనాల్లో ఉచితంగా తీసుకెళ్లి తీసుకొస్తారు.

ఫిలడెల్ఫియాలో…

ఇదిలావుంటే ఫిలడెల్ఫియాలో అక్కడి వాణిజ్య సంస్థలు కూడా భారీ ప్రకటనలు చేస్తున్నాయి. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు టీకా తీసుకుంటే…  100 నుంచి 200 డాలర్ల ప్రోత్సాహకాలు అందుస్తున్నాయి.

షికాగోలో…

టీకా వేయించుకున్నవారికి ఈ వేసవిలో సాగే సంగీత విభావరులకు ఉచిత పాసుల ఇస్తున్నాయి.

కనెక్టికట్‌లో…

టీకాలు వేయించుకున్నవారికి తమ దగ్గర ఆహారం కొంటే డ్రింక్స్‌ ఉచితం ఆఫర్‌ చేస్తున్నాయి రెస్టారెంట్లు.

న్యూయార్క్‌లో…

18 ఏళ్లు పైబడి టీకా వేయించుకున్నవారికి 20 డాలర్ల విలువైన లాటరీ టికెట్‌ ఉచితంగా ఇస్తున్నాయి. లాటరీ తగిలితే 50 లక్షల డాలర్ల బహుమతి వచ్చే ఛాన్స్ ఉంది.

అమెరికాలో ఇప్పటివరకూ వ్యాక్సినేషన్‌ జరిగిన తీరు…

అమెరికా మొత్తం జనాభా – 32.8 కోట్లు మొత్తం జనాభాలో కనీసం ఒక్క డోసు టీకా పొందినవారు – 16,24,70,794 రెండు డోసుల పూర్తి టీకా పొందినవారు – 12,90,06,463 దేశ జానాభాలో ఒక్క డోసు టీకా పొందినవారు 48.9 శాతం కాగా, రెండు డోసులు పొందినవారు 38.9 శాతం

65 ఏళ్లు పైబడినవారిలో ఒక్క డోసు వ్యాక్సిన్‌ పొందినవారు – 4,66,20,321 65 ఏళ్లు పైబడినవారిలో రెండు డోసులు వ్యాక్సిన్‌ పొందినవారు – 4,03,22,410 అంటే… జనాభాలో 85.2 శాతం మంది వృధ్దులకు కనీసం ఒక్క డోసు టీకా, 73.7 శాతం మంది వృద్దులకు రెండు డోసుల టీకా అందింది

18 ఏళ్లు పైబడినవారిలో ఒక్క డోసు వ్యాక్సిన్‌ పొందినవారు – 15,77,20,909 18 ఏళ్లు పైబడినవారిలో రెండు డోసుల వ్యాక్సిన్‌ పొందినవారు – 12,71,11,729 అంటే… జనాభాలో 18 ఏళ్లు పైబడినవారిలో ఒక్క డోసు టీకా పొందినవారు 61.1 శాతం మంది జనాభాలో 18 ఏళ్లు పైబడినవారిలో రెండు డోసులు టీకా పొందినవారు 49.2 శాతం మంది

అమెరికాలో 12 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ జరుగుతుండటం విశేషం తాజా లెక్కల ప్రకారం అమెరికాలో 6.2 కోట్ల డోసుల టీకాల నిల్వ ఉంది. టీకాలు ఎక్కువ, టీకా వేయించుకునేవారు తక్కువ… ఇదీ ప్రస్తుత అమెరికా పరిస్థితి అందుకే ఈ ఆఫర్లు ఇస్తున్నాయి అక్కడి విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి : తెలుగు రాష్ట్రాలపై యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

He can do it in next match: ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ కొట్టడం ఖాయం.. కోహ్లీకి అండగా నిలిచిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ