He can do it in next match: ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ కొట్టడం ఖాయం.. కోహ్లీకి అండగా నిలిచిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..

ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ శతకం సాధిస్తాడని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సల్మాన్‌ బట్‌ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ మూడంకెల స్కోర్‌ అందుకోక దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడి కెరీర్‌లో ఇంత వ్యత్యాసం..

He can do it in next match: ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ కొట్టడం ఖాయం.. కోహ్లీకి అండగా నిలిచిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్..
Salman Butt On Virat Kohli
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2021 | 6:28 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీలపై వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు పొడత్తలతో ముంచేస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిస్తూ పోస్ట్ పడితే.. తాజాగా పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్ కూడా అదే వరుసలో నిలిచాడు. వచ్చే ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోవడం ఖాయం అంటూ జోస్యం చెప్పాడు.  తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ భారత సారథిపై ప్రశంసలు కురిపించాడు.

‘కోహ్లీ ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుకొట్టాడు. ఈ వయసులో ఒక ఆటగాడు 70 సెంచరీలు సాధిస్తాడని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు అతడున్నంత ఫిట్‌నెస్‌తో ఎవరైనా ఉంటారని అనుకున్నారా? లేదా అతడున్న ఫామ్‌ గురించి ఆలోచించారా? ప్రస్తుతం కోహ్లీ ఛేదనల్లో 90 స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు .

ఏడాదికి పైగా సెంచరీ సాధించకపోయినా అతడు చేసిన పరుగులు చూడండి మీకే అర్థమవుతుంది. కోహ్లీ సెంచరీ కొట్టకపోతే అసలు పరుగులే చేయలేదని మనం అనుకుంటాం. మరో శతకం కొట్టడానికి అవసరమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది కేవలం సమయంతో ముడిపడి ఉంది’ అని సల్మాన్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

కోహ్లీ మూడంకెల స్కోర్‌ అందుకోక దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడి కెరీర్‌లో ఇంత గ్యాప్ రావడం ఇదే తొలిసారి. 2019 నవంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌పై టెస్టు మ్యాచ్‌ సందర్భంగా సెంచరీ కొట్టాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 70వ సారి ఆ ఘనత నమోదు చేశాడు. అప్పటి నుంచీ కోహ్లీ మరో శతకం బాదలేదు.

ఇవి కూడా చదవండి: CycloneYaas : యాస్ తుఫానుపై ప్రధాని రివ్యూ .. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆయా మంత్రిత్వశాఖలకు దిశానిర్దేశం

Collector: యువ‌కుడి చెంప‌ చెల్లుమ‌నిపించిన‌ క‌లెక్ట‌ర్‌.. అంత‌లోనే క్ష‌మాప‌ణ‌లు.. అయినా త‌ప్ప‌ని వేటు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!